స్నానమా...ఇలా చేయండి!

ఒత్తిడి తగ్గాలన్నా, మేను మెరిసిపోవాలన్నా... ముఖానికి ప్యాక్‌లూ, క్రీములూ రాయడమే కాదు... స్నానం చేసే తీరులోనూ మార్పు చేసువాలంటారు సౌందర్య నిపుణులు.

Updated : 01 Mar 2023 05:02 IST

ఒత్తిడి తగ్గాలన్నా, మేను మెరిసిపోవాలన్నా... ముఖానికి ప్యాక్‌లూ, క్రీములూ రాయడమే కాదు... స్నానం చేసే తీరులోనూ మార్పు చేసువాలంటారు సౌందర్య నిపుణులు.

మర్దన కావాలి... స్నానమంటే ఏదో నాలుగు చెంబుల నీళ్లు పోసుకుని రావడం  కాదు. శరీరానికి మర్దన అందాలి. చేరిన మురికీ వదిలిపోవాలి. అందుకోసం ఏ మాత్రం సమయం దొరికినా...ఒంటికి గోరువెచ్చని నూనెతో మర్దన చేసుకోవడం మాత్రం మరచిపోవద్దు. పొడిబారే చర్మతత్వానికి ఆలివ్‌ నూనె, సాధారణ చర్మానికి బాదం తైలం బాగుంటాయి. వీటితో రుద్దడం వల్ల శరీరానికి చక్కటి రక్తప్రసరణ అందుతుంది. ఒత్తిడి అదుపులో ఉంటుంది. చర్మంలో పేరుకున్న మలినాలూ, వ్యర్థాలు బయటకు పోతాయి.

గులాబీలతో మెరిసేలా... ఒంటికి మర్దన అయ్యాక... గుప్పెడు గులాబీ రేకలకు రెండు తులసి ఆకుల్నీ చేర్చి ముద్దగా నూరాలి. దీనికి చెంచా బాదం
నూనె, కాస్త పంచదార కలిపి ఒంటికి పూతలా వేయండి. ఓ పావుగంటాగి స్నానం చేస్తే సరి...చర్మం నిగనిగలాడుతుంది.

శీకాయ స్నానం... సమపాళ్లల్లో ఆముదం, కొబ్బరి నూనె తీసుకుని అందులో రెండు చెంచాల మెంతిపిండి వేసి మరిగించాలి.  గోరువెచ్చగా అయ్యాక తలకు మర్దన చేయాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేస్తే సరి. మాడు శుభ్రపడుతుంది. వెంట్రుకలకు పోషణా అందుతుంది.

ఏ నీళ్లతో చేయాలంటే..... స్నానం అనగానే...వేడి వేడి నీళ్లు పోసుకుంటే ఒంటికి హాయిగా ఉంటుందనుకుంటారు కొందరు. కానీ, ఇది తప్పు. మరిగే నీళ్లు... సహజనూనెల్ని అడ్డుకుంటాయి. చర్మాన్ని, వెంట్రుకల్ని పొడిబారుస్తాయి. అందుకే, కాలం ఏదైనా నీళ్లు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఆ నీళ్లల్లో లావెండర్‌ బాత్‌ సాల్ట్‌ వేసి చూడండి. బాత్‌టబ్‌ ఉంటే సరి లేదంటే...ఆ నీటితోనే స్నానం చేయండి. చర్మం కళగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్