Published : 13/03/2023 00:10 IST

పాత వాటికి.. కొత్త లుక్‌!

బీరువాలో ఎన్ని డ్రెస్సులు ఉన్నా... అమ్మాయిల నుంచి వచ్చే మాట... మా దగ్గర సరైన దుస్తులు లేవనే. ముఖ్యంగా కాలేజీలకు వెళ్లేవారు నెలకోసారైనా ఈ మాట అంటారు. మరి ఇవన్నీ ఏంటని ప్రశ్నిస్తే వేసేసుకున్నాంగా... మా స్నేహితులు చూసేశారు మమ్మీ అంటూ సమాధానమిస్తారు. భలే చిత్రమైన పరిస్థితి కదూ! అందుకే రోజువారీ వేసుకునే బ్లౌజులు, షర్ట్స్‌, టాప్స్‌, త్రీబైఫోర్త్స్‌కి కొత్త లుక్‌ ఇచ్చేయండి. ఈ ఎంబ్రాయిడరీ బటన్స్‌అందుకు సాయపడతాయి. మార్కెట్‌లో ఇప్పుడు రకరకాల బటన్స్‌ దొరుకుతున్నాయి. మనసును ఆకట్టుకునే ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ ఉన్న వాటిని ఎంచుకుని దుస్తులకు కుట్టేస్తే సరి! కొత్త లుక్‌ వచ్చేస్తుంది. ప్రయత్నించి చూడండి మరి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని