Updated : 13/03/2023 02:53 IST

ఇంతకీ వాటిని మార్చారా..?

ఎండ దంచేస్తోంది. కాటన్‌ దుస్తులన్నీ ఈపాటికే బయటికి వచ్చేసుంటాయి. ఇంతకీ.. చర్మ పరిరక్షణలోనూ మార్పులు చేశారా లేదా?

ఏ క్రీమ్‌.. కాలమేదైనా ఒకటే క్రీమ్‌ అన్న ధోరణి వద్దు. చలికాలంలో కాస్త ఎక్కువ తేమనిచ్చే క్రీములు వాడతాం. వాటినే వేసవిలోనూ ఉపయోగిస్తామంటేనే సమస్య! ముఖం జిడ్డు పట్టడమే కాదు.. చిరాకుగానూ తోస్తుంది. కాబట్టి, హైలురోనిక్‌ యాసిడ్‌, నీటి ఆధారిత క్రీములను ఎంచుకోండి. ఇవి చర్మంలోకి తేలిగ్గా ఇంకడమే కాదు.. జిడ్డు భావననీ కలిగించవు.

సన్‌స్క్రీన్‌.. కాలమేదైనా సన్‌స్క్రీన్‌ తప్పనిసరి చేసుకోమంటారు నిపుణులు. ఈ కాలం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎస్‌పీఎఫ్‌ 50 ఉన్నది ఎంచుకోండి. కేవలం రాసుకొని వదిలేయడమే కాదు. ఎండలోకి వెళితే ప్రతి రెండు గంటలకోసారి తిరిగి రాసుకుంటూ ఉండటం అలవాటు చేసుకోండి. చర్మతత్వానికి తగ్గట్టుగా వాటర్‌ప్రూఫ్‌, స్వెట్‌ ప్రూఫ్‌వి ఎంచుకుంటే చెమటకు పోతుందన్న భయముండదు.

స్క్రబింగ్‌.. ఈకాలంలో రేగే దుమ్ము, చెమట.. ఇవన్నీ చర్మరంధ్రాలకు హాని చేసేవే. కాబట్టి, వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫో లియేటింగ్‌ తప్పనిసరి చేసుకోవాలి. అలాగని మరీ గరుకుగా ఉండే స్క్రబ్‌లను ఎంచుకోవద్దు. చర్మపొరల్లో గాయాలకు కారణమవొచ్చు. గ్లైకాలిక్‌ యాసిడ్‌, ఏహెచ్‌ఏలున్నవి వేసవిలో చర్మానికి మేలు చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని