ఎత్తు చెప్పులు బాగున్నా కానీ..

చెప్పులు లేకుండా నడవడం ప్రస్తుత రోజుల్లో అసాధ్యం. అలాగని ఏదో సాదాసీదా రకాల్ని ఎంచుకునే తరం కాదిది.

Updated : 15 Mar 2023 05:37 IST

చెప్పులు లేకుండా నడవడం ప్రస్తుత రోజుల్లో అసాధ్యం. అలాగని ఏదో సాదాసీదా రకాల్ని ఎంచుకునే తరం కాదిది. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త ట్రెండ్‌లను ఫాలో అవడం మామూలే అయినా... వాటిల్లో ఎత్తు చెప్పులదే హవా. వీటిని వాడటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందుల పాలవకతప్పదు. అవేంటంటే...

* ఎత్తు మడమల చెప్పులు ఎంచుకునేటప్పుడు సహజంగా చేసే పొరబాటు సరైన సైజున్నవి తీసుకోకపోవడం, డిజైను నచ్చిందనో, ట్రెండీగా ఉందనో ఏదో ఒకటి కొనుక్కుంటారు. వయసు, కాలం వంటివి ఆధారంగా పాదాల పరిమాణం మారుతూ ఉండొచ్చు. అలాంటిదేదైనా గమనిస్తే కచ్చితంగా దాన్ని మార్చాల్సిందే. 

కొనేప్పుడే వాటిని ఓ సారి వేసుకుని సౌకర్యంగా ఉన్నాయో లేదో గమనించుకోండి.

* ఎత్తు చెప్పులు చూడ్డానికి ఎంత బాగున్నా...అవి ఎత్తు పెరిగే కొద్దీ వాటి భారం పాదాలపై పడుతుందని మరిచిపోవద్దు. ఒక అంగుళానికి మించి ఉన్నవాటి జోలికిపోకపోవడమే మంచిది.

* ఎత్తుమడమల చెప్పుల్ని తరచూ వాడుతుంటే...అవి పాదం సహజ ఆకృతిని మార్చే ప్రమాదం ఉంది. అలానే శరీర బరువుని పాదాలు సరిగా బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడం వల్ల వెన్నెముక కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. వీలైనంతవరకూ పాయింట్‌ హీల్స్‌ రకాలు కాకుండా...పాదం బరువుని సమానంగా ఆన్చుకునేలా...వెడ్జెస్‌ తరహావి ఎంచుకుంటే మేలు.

* హైహీల్స్‌ను ఇరవై నిమిషాలకు మించి వేసుకోకూడదు ముఖ్యంగా గర్బిణులు వాడకూడదు. పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ ఉన్న వారు వీటికి దూరంగా ఉండాలి. రోజంతా వాటితో ఉండాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా...వాటిని వదిలి పాదాలను ముందుకు వంచడం, మడమ గుండ్రంగా తిప్పడం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్