Published : 17/03/2023 00:07 IST

జుట్టు రాలుతోంటే..

మెత్తగా నిగనిగలాడుతూ ఉండే ఆరోగ్యకరమైన జుట్టు కోరుకోని అమ్మాయుంటుందా? కానీ తరచూ రాలే వెంట్రుకలేమో ఒత్తిడి పెంచేస్తాయి. ఈ చిన్ని చిట్కాలు ప్రయత్నించి చూడండి.. ఉపశమనం దొరుకుతుంది.

ప్పు బియ్యం తీసుకొని కడగండి. ఆపై మూడు కప్పుల నీళ్లు పోసి.. గంటసేపు నాననివ్వండి. తర్వాత ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి. తలస్నానం అయ్యాక తలంతా ఆ నీటిని స్ప్రే చేసుకొని పావు గంటయ్యాక చల్లటి నీటితో కడిగేస్తే సరి. ఈ నీటిలో శిరోజాల పెరుగుదలను ప్రోత్సహించే అమైనో యాసిడ్స్‌, న్యూట్రియంట్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కుదుళ్లను బలంగా మార్చడంతోపాటు వెంట్రుకలు తెగడం, చిట్లడం వంటివాటినీ అరికడతాయి.

*  అరకప్పు బియ్యపు కడుగుకు తగినంత ఉసిరిపొడిని కలిపి, పది నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తలంతా పట్టిస్తే సరి. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వెంట్రుకల పెరుగుదలను ప్రోత్స హించడంతోపాటు ఊడటాన్నీ తగ్గిస్తుంది.

* పెరుగులో మెంతులని నానబెట్టి రాయడం మనకు అలవాటే! ఈసారి బియ్యపు నీటిలో నానబెట్టి, ఆపై నూరి తలకు పట్టించండి. వెంట్రుకలు చిట్లడం, తెగిపోవడం వంటి సమస్యలుండవు.

* రోజ్‌మెరీ ఆయిల్‌ రక్తప్రసరణను మెరుగుపరిచి కురులను వేగంగా పెరిగేలా చేయగలదు. దీన్ని బియ్యం నీటిలో కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించి, మర్దనా చేయాలి. అరగంటయ్యాక రసాయనాల్లేని షాంపూతో తలస్నానం చేసినా వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని