బొమ్మలకు బ్యాగులు..

మనసుకు నచ్చిన బొమ్మలతో ఆడుకున్న తర్వాత చిన్నారులు కాసేపు వాటినొదిలేస్తారు. ఇల్లంతా పరిచేసి మరీ.. వేరే పనిలో నిమగ్నమైపోతారు. గంటకోసారి ఇల్లు సర్దాలంటే అమ్మలకు సాధ్యమయ్యే పనికాదు.

Published : 20 Mar 2023 00:23 IST

మనసుకు నచ్చిన బొమ్మలతో ఆడుకున్న తర్వాత చిన్నారులు కాసేపు వాటినొదిలేస్తారు. ఇల్లంతా పరిచేసి మరీ.. వేరే పనిలో నిమగ్నమైపోతారు. గంటకోసారి ఇల్లు సర్దాలంటే అమ్మలకు సాధ్యమయ్యే పనికాదు. అలా పుట్టిందే.. ఈ కొత్త ఆలోచన. వర్ణభరితంగా రకరకాల జంతువుల బొమ్మల డిజైన్లలో వస్తున్న ఈ బ్యాగులను పిల్లల గదుల్లో వారికందేలా తగిలించాలి. ఆట తర్వాత అందులో సర్దేయడం అలవాటు చేస్తే చాలు. బొమ్మలకూ ఇళ్లున్నాయంటూ బుజ్జాయిలూ.. సరదాగా సర్దేయడం నేర్చుకుంటారు. ఇంకేముంది.. ఇల్లాలికీ కొంతలో కొంత విశ్రాంతి. మరింక ఆలస్యమెందుకు.. మీ చిన్నారులకూ అందుబాటులో ఉంచేయండీ బ్యాగులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్