అందానికి కొన్ని నియమాలు!
అందంగా, ఆరోగ్యంగా మెరిసే చర్మం కావాలనుకోవడం సహజమే! అందుకు తగ్గ నియమాలు పాటిస్తున్నారా మరి? అవేంటంటే.. ఎండకి వీలైనంత దూరంగా ఉండండి. ఇది చర్మానికి హాని చేయడమే కాదు.. ఇతర సమస్యలనూ కలిగించగలదు. అంతేకాదు.. వృద్ధాప్య ఛాయలకీ ఇదే ప్రధాన కారణం. మరీ అవసరమైతే తప్ప ఎండలోకి వెళ్లకపోవడం మంచిది.
అందంగా, ఆరోగ్యంగా మెరిసే చర్మం కావాలనుకోవడం సహజమే! అందుకు తగ్గ నియమాలు పాటిస్తున్నారా మరి? అవేంటంటే..
* ఎండకి వీలైనంత దూరంగా ఉండండి. ఇది చర్మానికి హాని చేయడమే కాదు.. ఇతర సమస్యలనూ కలిగించగలదు. అంతేకాదు.. వృద్ధాప్య ఛాయలకీ ఇదే ప్రధాన కారణం. మరీ అవసరమైతే తప్ప ఎండలోకి వెళ్లకపోవడం మంచిది. వెళ్లినా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ని తప్పనిసరిగా రాయాలి. సహజ సౌందర్య ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వండి. రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌తో కూడినవి చేటు చేయగలవు.
* కేవలం పైపూతలతో నిగారింపు సాధ్యమవదు. లోపలి నుంచీ పోషణ కావాలి. కాబట్టి, చర్మానికి, ఆరోగ్యానికి హాని కలిగించే ప్రాసెస్డ్, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు ప్రాధాన్యమివ్వాలి. రోజులో తగినన్ని నీరు తాగుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి.
* త్వరిత ఫలితాల కోసం సప్లిమెంట్లను ఎంచుకుంటున్న వారూ ఎందరో! ఆహారం ద్వారా భర్తీ కాని ఎన్నో పోషకాలను అవి అందిస్తాయి. కాబట్టి, మంచిదే. అయితే వృక్ష ఆధారితమైనవి, ప్రిజర్వేటివ్స్ లేనివి అవునో కాదో చూసుకోవడం మర్చిపోవద్దు.
* ఒత్తిడి ప్రభావం మనసుపైనే కాదు.. చర్మంపైనా పడుతుంది. యాక్నే, త్వరిత వృద్ధాప్యఛాయలు వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టిపెట్టండి. 7-8 గంటల నిద్ర తప్పనిసరి చేసుకోండి.
* చర్మానికి రోజువారీ సంరక్షణ మంచిదే. అయితే అది హద్దు దాటుతోందేమో కూడా చూసుకోవాలి. అతిగా స్క్రబింగ్, పదే పదే ఉత్పత్తులను మార్చడం వంటివన్నీ చర్మంపై ఒత్తిడికి కారణమవుతాయి. త్వరిత ఫలితాల కోసం ఆశించక.. ఓపికతో సాగండి. అప్పుడే దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!