తేమ తెచ్చే మెరుపు..

మాయిశ్చరైజర్లు, క్రీంలెన్ని రాసినా కొందరి చర్మం మెరవదు. కొన్ని పద్ధతులను పాటిస్తే చర్మాన్ని నిత్యం తాజాగా ఉంచుకోవచ్చు.. 4-2-4 పద్ధతిలో.. క్లెన్సింగ్‌ చేసేటప్పుడు ముఖానికి నాలుగు నిమిషాలు ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెతో మృదువుగా మర్దనా చేయాలి. ఆ తర్వాత ఆపిల్‌ సిడార్‌, వెనిగర్‌ ఉన్న ఫోమింగ్‌ క్లెన్సర్‌తో రెండు నిమిషాలు రుద్దాలి.

Published : 24 Mar 2023 00:40 IST

మాయిశ్చరైజర్లు, క్రీంలెన్ని రాసినా కొందరి చర్మం మెరవదు. కొన్ని పద్ధతులను పాటిస్తే చర్మాన్ని నిత్యం తాజాగా ఉంచుకోవచ్చు..

4-2-4 పద్ధతిలో.. క్లెన్సింగ్‌ చేసేటప్పుడు ముఖానికి నాలుగు నిమిషాలు ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెతో మృదువుగా మర్దనా చేయాలి. ఆ తర్వాత ఆపిల్‌ సిడార్‌, వెనిగర్‌ ఉన్న ఫోమింగ్‌ క్లెన్సర్‌తో రెండు నిమిషాలు రుద్దాలి. చివర్లో నాలుగు నిమిషాలు నీటితో ముఖాన్ని మసాజ్‌ చేస్తూ శుభ్రపరచాలి. మేకప్‌ను తొలగించా లన్నా లేదా మేకప్‌ ముందు ముఖాన్ని మురికి లేకుండా శుభ్రపరచాలన్నా ఈ పద్ధతి పాటించాలి. అప్పుడే రక్తప్రసరణ బాగా జరిగి ముఖం తాజాగా ఉంటుంది. ఫౌండేషన్‌ వంటివి చర్మంలో కలిసి మరింత మృదువుగా మారుతుంది.

ఎలా చేయాలంటే.. ముఖాన్ని క్లెన్సింగ్‌ చేసేటప్పుడు జిడ్డు ఎక్కువగా చేరే నుదురు, ముక్కు రెండువైపులా ఉండే ప్రాంతాన్ని మర్దన చేయాలి. ఆ తర్వాత పొడిగా ఉండే చెక్కిళ్ల ప్రాంతమైన యూ జోన్‌ను ఎంచుకోవాలి.

మూడు సెకన్లు... ముఖాన్ని క్లెన్సింగ్‌ చేసిన మూడు సెకన్లకు చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగేలోపే జెల్లీ ప్యాక్‌ లేదా క్రీం తప్పనిసరి. అప్పుడే చర్మానికి తేమ అందుతుంది. ఫేషియల్‌ మిస్ట్‌ స్ప్రే చేసినా చాలు. చర్మం పొడారకుండా తేమగా మారుతుంది. అలాగే రోజులో నాలుగు లీటర్ల నీటిని తీసుకుంటే చర్మంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. చర్మం హైడ్రేట్‌ అయ్యి, తేమగా మారుతుంది.

సహజంగా... రసాయనాల్లేకుండా ఇంట్లో తయారుచేసే మాస్క్‌ వినియోగించాలి. కోడిగుడ్డు తెల్లసొనకు చెంచా తేనె కలిపి ఆ  మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఆరాక చల్లని నీటితో శుభ్రపరచాలి. చర్మం మృదువుగా మారుతుంది. చెంచా తేనె, రెండు చెంచాల నీటిని కలిపిన మిశ్రమాన్ని రాసి ఆరనిచ్చి కడిగినా ఫలితం ఉంటుంది. నిద్రపోయే ముందు రెండుమూడు రోజులకొకసారి ఇలా చేస్తే చర్మం తాజాగా మారుతుంది.

రోజూ వద్దు.. వారానికి రెండుసార్లు మాత్రమే మాస్కు వేయడం మంచిది. మొదటిసారి హోంమేడ్‌ వినియోగించినప్పుడు చర్మానికి బూస్టర్‌గా పనిచేస్తుంది. రెండు మూడు రోజుల తర్వాత సీరంలో ముంచిన షీట్‌ మాస్క్‌ను వేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత తొలగిస్తే చాలు. చర్మానికి పోషకాలు అంది మృదువుగా మెరుపులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్