జుట్టుకి అరటిపూత!

జుట్టుకి తగిన పోషణ, సంరక్షణ ఉన్నప్పుడే...ఆరోగ్యంగా అందంగా ఎదుగుతుంది. ఇందుకోసం ఖరీదయిన సౌందర్య ఉత్పత్తులే వాడక్కర్లేదు. రోజూ మనం తినే అరటిపండే చాలు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారా?

Published : 31 Mar 2023 00:15 IST

జుట్టుకి తగిన పోషణ, సంరక్షణ ఉన్నప్పుడే...ఆరోగ్యంగా అందంగా ఎదుగుతుంది. ఇందుకోసం ఖరీదయిన సౌందర్య ఉత్పత్తులే వాడక్కర్లేదు. రోజూ మనం తినే అరటిపండే చాలు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారా?

* ఒక అరటిపండుని గుజ్జుగా చేసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి బాగా మెత్తగా చేయాలి. దీనికి అరకప్పు పెరుగు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. ఆరాక తలస్నానం చేస్తే సరి. పొడిబారిన జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.

* బాగా మగ్గిన అరటిపండు ఒకటి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌నూనె కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.

* జుట్టు ఎక్కువగా రాలుతోందా.. కప్పు అరటిపండు గుజ్జులో రెండు పెద్ద చెంచాల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించండి. ఆరాక తలస్నానం చేస్తే సరి. ఇందులోని పోషకాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్