ఆలివ్‌తో కాంతులీనేలా..
ఆలివ్ నూనె ఆరోగ్యానికే కాదు... అందానికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న అమ్మాయిలను వేధించే ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారమిది.
ఆలివ్ నూనె ఆరోగ్యానికే కాదు... అందానికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న అమ్మాయిలను వేధించే ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారమిది.
* సూపర్‌మార్కెట్లలో ఈ నూనె లైట్, ప్యూర్, వర్జిన్, ఎక్‌స్ట్రా వర్జిన్ అని మూడు రకాలుగా దొరుకుతుంది. చర్మానికి ఉపయోగించేందుకు ఎక్‌స్ట్రా వర్జిన్ నూనెను ఎంచుకోవాలి.
* ముఖంపై పేరుకున్న హానికారక కాలుష్యం, దుమ్మును తొలగించేందుకు మంచి క్లెన్సర్‌లాగా పనిచేస్తుంది. రెండు చెంచాల ఆలివ్‌నూనె తీసుకొని దూదితో ముఖం మొత్తం రాయాలి. ఎలాంటి చర్మం వారికైనా ఇది చక్కగా పనిచేస్తుంది. పదినిమిషాల తర్వాత కడిగేస్తే సరి.
* రెండు చెంచాల ఆలివ్‌నూనెలో అరచెంచా నిమ్మరసం కలుపుకోవాలి. దీంతో మేకప్ తొలగిస్తే చర్మానికి హాని కలగకుండా ఉంటుంది. అలాగే ఆలివ్‌నూనెలో కొద్దిగా కలబంద గుజ్జుని కలిపి మేకప్ తీసేసినా చర్మానికి తేమను అందిస్తుంది. దాంతో ముఖంపై దద్దుర్లు రాకుండా ఉంటాయి.
* ఈ నూనె నేరుగా మొటిమలు ఉన్న ప్రాంతంలో దూదితో రాసుకోవాలి. దీంట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముఖంపై ఉన్న వాపు, యాక్నేనీ తగ్గిస్తాయి. తరచూ వాడటం వల్ల మొటిమల నుంచి పరిష్కారం దొరుకుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.