మేకప్‌ వేసుకోవడం కొత్తా...

చిన్నా, పెద్దా వేడుక ఏదైనా...ఇప్పుడు అంతా మేకప్‌ని వేసుకుంటున్నారు. ఆ అలవాటు కొత్తయినప్పుడు... ఈ జాగ్రత్తలు తీసుకుంటే అందంగా మెరిసిపోవచ్చు. అవేంటంటారా?

Published : 04 Apr 2023 00:44 IST

చిన్నా, పెద్దా వేడుక ఏదైనా...ఇప్పుడు అంతా మేకప్‌ని వేసుకుంటున్నారు. ఆ అలవాటు కొత్తయినప్పుడు... ఈ జాగ్రత్తలు తీసుకుంటే అందంగా మెరిసిపోవచ్చు. అవేంటంటారా?

* మేకప్‌ వేసుకునే ముందు ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆపై టోనర్‌, మాయిశ్చరైజర్‌ రాసుకుని ప్రైమర్‌తో అలంకరణ మొదలుపెట్టాలి. ఇది ఐషాడో, బ్లష్‌ వంటి వాటి ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది.

* కన్సీలర్‌ను ఫౌండేషన్‌ కన్నా ముందే రాసుకోవాలని కొందరంటే, ఇంకొందరు ముందు ఫౌండేషన్‌ రాయడమే మేలంటారు. ఈ సూత్రం చర్మ తీరుని బట్టి ఉంటుందన్న విషయం మరిచిపోవద్దు. ముందు ఓ సారి వేసుకుని చూశాకే...ఎలా రాస్తే మేలో మీరే నిర్ణయించుకోండి.

* అదయ్యాక... మేకప్‌ ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి సెట్టింగ్‌ పౌడర్‌ని వాడాలి. మరీ ఎబ్బెట్టుగా కనిపించకూడదనుకునేవారు టాల్కం పౌడర్‌నీ వాడొచ్చు. చివరగా కనుబొమలను పెన్సిల్‌తో దిద్ది, కళ్లకు కాజల్‌ పెడితే చాలు. పెదాలకు లిప్‌ పెదాలకు లిప్‌గ్లాస్‌ అద్దితే సరి... మోము మెరిసిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్