సహజ ‘డియో’లివీ!
ఎండవేడికి చెమట.. దాన్నుంచి వచ్చే దుర్వాసన! పెర్‌ఫ్యూమ్‌ల రసాయనాలతోనేమో శరీరానికి హాని. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లకూ దారితీయొచ్చు. పరిష్కారం కావాలా.. సహజంగా ప్రయత్నించేయండి.
ఎండవేడికి చెమట.. దాన్నుంచి వచ్చే దుర్వాసన! పెర్‌ఫ్యూమ్‌ల రసాయనాలతోనేమో శరీరానికి హాని. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లకూ దారితీయొచ్చు. పరిష్కారం కావాలా.. సహజంగా ప్రయత్నించేయండి.
* బేకింగ్ సోడా... పావు చెంచా బేకింగ్ సోడాకి తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. స్నానమయ్యాక ఈ మిశ్రమాన్ని బాహుమూలల్లో పలుచని పొరలా రాసి, ఆరనిస్తే సరి. ఇది చెమటను పీల్చేసుకొని అక్కడి చర్మాన్ని చాలాసేపటి వరకూ పొడిగా ఉంచుతుంది. చర్మ దుర్వాసనకు కారణమయ్యే ఆమ్లాలను తటస్థీకరిస్తుంది.
* యాపిల్ సిడార్ వెనిగర్.. ఇది చర్మ పీహెచ్ స్థాయులను తగ్గిస్తుంది. దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాలనూ నిరోధిస్తుంది. మగ్గు నీటిలో కప్పు వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని స్నానమయ్యాక శరీరమంతా తడిసేలా పోసుకుంటే చాలు. దూదితో బాహుమూలల వరకూ రాసుకున్నా సరే.
* కొబ్బరినూనె.. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. కొన్ని చుక్కలు తీసుకొని చర్మంలో ఇంకేవరకూ బాహుమూలల్లో పూయాలి. ఇది అక్కడి చర్మానికి తేమనందిస్తుంది. చెడు వాసన తగ్గిస్తుంది.
* నిమ్మరసం.. స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలపండి. దీనిలోని సిట్రిక్ యాసిడ్ శరీరాన్ని తాజాగా ఉంచుతూనే దుర్వాసననీ దూరం చేస్తుంది.
* స్ఫటిక.. ఇదో మినరల్ సాల్ట్. యాస్ట్రింజెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. చెమట ఎక్కువగా విడుదలవ్వకుండా చూస్తూనే దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులనీ చంపుతుంది. నీటిలో కరిగించి, స్నానమయ్యాక చెమట ఎక్కువ పోసే ప్రాంతాల్లో స్ప్రే చేసుకుంటే చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.