చల్లచల్లగా ఫేస్‌ప్యాక్..
పుచ్చకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయని మనందరికీ తెలుసు. ఇది చర్మాన్నీ కాంతులీనేలా చేస్తుంది. అదేలాగో చూద్దామా.
పుచ్చకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయని మనందరికీ తెలుసు. ఇది చర్మాన్నీ కాంతులీనేలా చేస్తుంది. అదేలాగో చూద్దామా.
పుచ్చకాయ సహజ టోనర్‌లా ఉపయోగపడుతుంది. చర్మంలోని మలినాలు, జిడ్డును కూడా తొలగిస్తుంది. వేసవిలో చర్మం ఎక్కువగా డీహైడ్రేట్ అవకుండా చేయడంలోనూ ఇది సాయపడుతుంది.
* స్పూను పుచ్చకాయ రసంలో నాలుగు చుక్కల కొబ్బరినూనె వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో ముఖానికి, మెడకు రాసుకొని అయిదు నుంచి పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇది మంచి క్లెన్సర్‌లాగా పనిచేస్తుంది.
* రెండు చెంచాల బియ్యప్పిండి తీసుకొని దానికి తగినంత పుచ్చకాయ రసాన్ని కలపాలి. మూడు నిమిషాలు ముఖంపై రుద్దుతూ మర్దన చేయాలి. మరీ గట్టిగా రుద్దొద్దు. ఇది చర్మంపై నల్లమచ్చలు, మృతకణాలను తొలగించడంలో సాయపడుతుంది.
* తేనె, పుచ్చకాయ రసం, నిమ్మ రసం, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి, మర్దన చేయాలి. చర్మానికి తేమ అంది మెరుపు సంతరించుకుంటుంది.
* ఒక గిన్నెలో సెనగపిండి చెంచా, పాలు చెంచా, తగినంత పుచ్చకాయ రసం తీసుకొని బాగా కలపాలి. దీన్ని మేకప్ బ్రష్ సాయంతో ముఖానికి రాయాలి. 15నిమిషాల పాటు ఆరనిచ్చి చన్నీళ్లతో శుభ్రం చేయాలి. సహజంగా మెరుపులీనే చర్మం మీ సొంతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.