గులాబీ అందానికి గులాం!

ఎన్నిరకాల పూలున్నా... గులాబీల ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా ఫ్యాషన్‌ యవనికపై రోజా పువ్వుది ప్రత్యేక స్థానం. అమ్మమ్మ, అమ్మల తరంలోనే కాదు... మా తరానికీ ఇదే హాట్‌ ఫేవరెట్‌ అంటోంది యువత.

Published : 07 Apr 2023 00:30 IST

ఎన్నిరకాల పూలున్నా... గులాబీల ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా ఫ్యాషన్‌ యవనికపై రోజా పువ్వుది ప్రత్యేక స్థానం. అమ్మమ్మ, అమ్మల తరంలోనే కాదు... మా తరానికీ ఇదే హాట్‌ ఫేవరెట్‌ అంటోంది యువత. ఎప్పటికప్పుడు కొత్త అందాలను మూటకట్టుకుని మురిపించే ఈ పువ్వు... ఇప్పుడు డిజిటల్‌ ప్రింట్‌ రూపంలో దుస్తులపై హొయలుపోతోంది. చీరలూ, లెహెంగాలూ, షర్టులూ, కుర్తీలూ, దుపట్టాలూ... ఒకటేమిటి అన్నింటిమీదా అందంగా ఒదిగిపోతోన్న ఈ ట్రెండ్‌... కట్టుకున్నవారికి కొత్త కళనూ తెచ్చిపెడుతోంది. వేసవిలో గుబాళిస్తోన్న ఈ గులాబీ పూల సోయగాన్ని మీరూ చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని