పాదాలు పదిలమేనా

దుస్తులు, పాత్రలు శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో ఎక్కువ సమయం ఉంటాం. దీనికి తోడు ఈ కాలంలో చెమట. వేళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయి.

Published : 07 Apr 2023 00:30 IST

దుస్తులు, పాత్రలు శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో ఎక్కువ సమయం ఉంటాం. దీనికి తోడు ఈ కాలంలో చెమట. వేళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయి. బిగుతుగా ఉండే షూ ధరించడం కూడా దీనికి ఒక కారణమే. వాటి పై శ్రద్ధ వహించండి లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. కాబట్టి..

* ఇన్ఫెక్షన్‌ తక్కువగా ఉన్నప్పుడే వాటిని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అవి తీవ్రతరమవుతాయి. యాంటీఫంగల్‌ క్రీములు, డ్రైపౌడర్‌లూ ఉపయోగిస్తే తొందరగా నయమవుతుంది.

* స్నానం చేసిన తర్వాత కాలి వేళ్ల సందుల్లో శుభ్రంగా తడి తుడవాలి. ఎప్పుడూ పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. సాక్సుల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ శుభ్రమైనవి ధరించండి. అందంగా ఉన్నాయని మరీ బిగుతైన షూలు కాకుండా మీ పాదాలకు నప్పేలా ఎంచుకోండి.

* ఏ రకం పాదరక్షలనైనా అప్పుడప్పుడూ శుభ్రం చేసేందుకు వీలుంటే చేయండి. లేకపోతే కనీసం వాటిని ఎండలో కొంత సమయం ఉంచితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం తక్కువ. స్నేహితులు, తోబుట్టువులు...ఇలా ఇతరులెవరివీ వేసుకోకూడదు. అలా చేస్తే ఫంగల్‌ ఇన్పెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది.

* పాదాలు నొప్పులుగా అనిపించినప్పుడు టబ్బులో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. దాంట్లో కొద్దిగా సోడా ఉప్పు, వెనిగర్‌, కళ్లుప్పు వేసి ఓ అరగంటపాటు పాదాలను అందులో ఉంచండి. తేలికపాటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్