ఏ బ్యాగు ఎంచుకుందాం...
ఒకప్పుడు హ్యాండ్‌బ్యాగ్ అంటే...అలంకరణలో ఓ భాగం. ఇప్పుడు గడపదాటి బయటికెళ్లే ప్రతి అమ్మాయి నిత్యావసరం. అందుకే ఇది ట్రెండీగా ఉండాల నుకుంటోంది ఈ తరం.
ఒకప్పుడు హ్యాండ్‌బ్యాగ్ అంటే...అలంకరణలో ఓ భాగం. ఇప్పుడు గడపదాటి బయటికెళ్లే ప్రతి అమ్మాయి నిత్యావసరం. అందుకే ఇది ట్రెండీగా ఉండాల నుకుంటోంది ఈ తరం. అయితే, దీన్ని సౌకర్యంగానూ ఎంచుకోవాలంటారు నిపుణులు. అదెలాగంటే...
* బ్యాగుని ఎంచుకునేటప్పుడు కంటికింపుగా కనిపించడమే కాదు దాని నాణ్యతా చూసుకోవాలి. మీ అవసరాన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంచుకోవాలి.
* అందరికీ ఒకే తరహా బ్యాగులు నప్పకపోవచ్చు. మీ శరీరాకృతికి సరిపోయే రకాన్ని ఎంచుకోవడం మేలు. ఉదాహరణకు మీరు సన్నగా, పొడవుగా ఉంటే పెద్ద పెద్ద స్ట్రాప్‌లు, స్లింగ్ రకాల జోలికి పోవద్దు. టోటే, బెర్ముడా హోబో, క్లచ్ రకాలు బాగుంటాయి.
* ఎత్తు తక్కువగా ఉన్నవారికి ఓవర్‌సైజ్ బ్యాగులు అంతగా నప్పవు. మీడియం రకాల్ని ఎంచుకోవాలి. సాచెల్, హోబో, టోటే, క్రాస్‌బాడీ రకాలు నప్పుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.