వేసవిలోనూ మృదువుగా..

ఈ వేడికి శరీరమే తట్టుకోలేదు. అలాంటిది సున్నితమైన పెదాలకి ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. శరీరంలో ఉన్న వేడికి, బయట ఉన్న వేడికి అధరాలు నిర్జీవంగా మారతాయి. మృదువుగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో చదివేయండి.

Published : 10 Apr 2023 00:49 IST

ఈ వేడికి శరీరమే తట్టుకోలేదు. అలాంటిది సున్నితమైన పెదాలకి ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. శరీరంలో ఉన్న వేడికి, బయట ఉన్న వేడికి అధరాలు నిర్జీవంగా మారతాయి. మృదువుగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో చదివేయండి..

* మాయిశ్చరైజర్‌లు, లిప్‌బామ్‌లు చలికాలంలో మాత్రమే రాయాలనే అపోహ చాలామందికి. కానీ వేసవిలోనూ పెదాలు డీహైడ్రేట్‌ అవుతాయి. కాబట్టి లిప్‌బామ్‌లు వాడటం తప్పనిసరి. అలాగే ఎస్‌పీఎఫ్‌ 15 ఉన్నవి ఎంచుకుంటే ఇంకా మంచిది. దీంతో పెదాలకు కావల్సినంత తేమ అందుతుంది. పిగ్మెంటేషన్‌ సమస్యా ఉండదు.

* ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత ఆ బ్రష్‌తో సున్నితంగా పెదాలపై రుద్దాలి. దాంతో పెదవులపై నిర్జీవంగా ఉన్న చర్మం తొలగిపోతుంది. అలాగే రక్తసరఫరా కూడా వృద్ధి చెందుతుంది. అప్పుడప్పుడూ పెరుగు, పాల మీగడ కొద్దిగా వేలితో తీసుకొని నిదానంగా పెదవులపై స్క్రబ్‌ చేయాలి. పగుళ్లు తగ్గడమే కాక అందంగా మారతాయి.

* వారంలో రెండు మూడు సార్లైనా పెదవులకు స్క్రబ్‌ ఉపయోగించాలి. ఒక గిన్నెలో తేనె, పంచదార ఒక చెంచా చొప్పున తీసుకొని కలుపుకోవాలి. దాంతో పెదాలపై మృదువుగా రుద్ది కాసేపయ్యాక కడిగేయాలి. తరచూ చేస్తే పెదవులు గులాబి రంగులో మెరిసిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్