మాడుకు మసాజర్లు..

చుండ్రు సమస్యను దూరం చేసి రక్తప్రసరణను మెరుగుపరిచే మసాజర్లు వచ్చాయిప్పుడు. శిరోజాల మధ్య తేలికగా కదులుతూ మాడును నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో సునాయాసంగా చేసే మర్దన ఒత్తైన జుట్టును సొంతం చేస్తుందంటున్నారు నిపుణులు.

Updated : 12 Apr 2023 13:04 IST

చుండ్రు సమస్యను దూరం చేసి రక్తప్రసరణను మెరుగుపరిచే మసాజర్లు వచ్చాయిప్పుడు. శిరోజాల మధ్య తేలికగా కదులుతూ మాడును నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో సునాయాసంగా చేసే మర్దన ఒత్తైన జుట్టును సొంతం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఎలక్ట్రిక్‌ స్కాల్ప్‌ మసాజర్‌.. ఇది వైర్‌లెస్‌, రీఛార్జిబుల్‌ మసాజర్‌. ఇందులో వేగాన్ని ఎక్కువ లేదా తక్కువగా మార్చుకొనే అవకాశం ఉంటుంది. దీంతో మాడుపై మసాజ్‌ చేస్తే.. రక్తప్రసరణ బాగా జరిగేలా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా వెంట్రుకలు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. రోజుకొకసారి పొడి జుట్టుపై దీన్ని వినియోగించొచ్చు.


స్కాల్ప్‌ మసాజర్‌ టింగ్లర్‌.. సన్నని మెటాలిక్‌ వైర్లలా ఉండి, చివర్లలో బీడ్స్‌ అమర్చి ఉన్న ఈ మసాజర్‌తో మర్దన చేస్తే మాడు అంతా సమానంగా రక్తప్రసరణ జరిగి ఆరోగ్యంగా మారుతుంది. జుట్టులో మూలమూలలకు ఈ టింగ్లర్‌ టచ్‌ అవుతుంది. ఒత్తిడి నుంచీ ఉపశమనం అందుతుంది.


డెర్మా రోలర్‌.. టైటానియం మైక్రో నీడిల్స్‌తో తయారైన ఈ మసాజర్‌ అతి సూక్ష్మమైన కణాలను ఉత్తేజపరుస్తుంది. రక్తప్రసరణ సరిగ్గా జరిగి, శిరోజాలు రాలే సమస్యను అదుపులో ఉంచుతుంది.


చెక్కతో.. దువ్వెనలా ఉండే ఈ ఉడెన్‌ హెడ్‌ మసాజర్‌ను టేకుతో తయారుచేస్తారు. దీంతో మాడును మృదువుగా బ్రష్‌ చేసినప్పుడు కణాలు ఉత్తేజమై రక్తప్రసరణ వేగవంతమవుతుంది. మనసు హాయిగా ఉంటుంది.


చివర్లలో రోలర్‌ బాల్స్‌తో.. ఈ స్కాల్ప్‌ మసాజర్‌లో ప్లాస్టిక్‌ హ్యాండిల్‌కు అటాచ్డ్‌గా ఉన్న అయిదు భాగాల చివర్లలో స్టీల్‌ రోలర్‌ బాల్స్‌ ఉంటాయి. దీంతో మాడుపై మసాజ్‌ చేసినప్పుడు రక్తప్రసరణ వేగవంతమవుతుంది. జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.


సిలికాన్‌ స్కాల్ప్‌ మసాజింగ్‌ బ్రష్‌... గుండ్రని ఆకారంలో ఉండే దీనికి ఓ వైపు మృదువైన పళ్లుంటాయి. దీంతో తలస్నానం చేసేటప్పుడు, నూనె మర్దనా చేసే సమయంలో లేదా పొడి జుట్టును మృదువుగా పావుగంట మసాజ్‌ చేయాలి. దీంతో మాడుపై మృతకణాలు తొలగి, శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్