మిడీస్‌లో గ్లామరస్‌గా..

అధునిక తరం అమ్మాయిల కోసం దుస్తుల్లో ఎన్ని హంగులో, అంత విభిన్నత! అందానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉన్న మిడీలను వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఇష్టపడుతున్నారు.

Published : 12 Apr 2023 00:48 IST

అధునిక తరం అమ్మాయిల కోసం దుస్తుల్లో ఎన్ని హంగులో, అంత విభిన్నత! అందానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉన్న మిడీలను వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఇష్టపడుతున్నారు. ఇంతగా అలరిస్తోన్న మిడీల్లో గ్లామరస్‌ లుక్‌ మాత్రమే కాదు.. బోల్డంత కంఫర్ట్‌ కూడా ఉందంటూ మురిసిపోతున్నారు. ఇంతకీ ఆ సౌఖ్యమేమిటో మీరూ చదివేసి.. నచ్చితే కొనేసుకోండి..

* నడుము దగ్గర బిగుతుగా ఉండి అక్కణ్నుంచి వదులుగా ఉండటంతో మిడీ అందమైన ఆకృతినిస్తూ చూడముచ్చటా ఉంటుంది. క్రాప్‌టాప్‌ ఫుల్‌హ్యాండ్స్‌ షర్ట్‌ లాంటివేవైనా దీనికి బాగుంటాయి. టక్‌ చేసినా, వదిలేసినా కళాత్మకంగానే ఉంటుంది. కిందికి జారిపోతున్నట్టో పైకి బిగపడుతున్నట్టో కాకుండా మోకాళ్ల దాకా లేదా ఇంకొంచెం కిందికి ఉండి కుదురుగా ఉంటుంది.

* సదుపాయంగా ఉండటంతో నడక సులువవుతుంది. మిడీ మీదికి స్టైలిష్‌ స్లిప్సర్స్‌, ఫ్లిప్‌ ఫ్లాప్స్‌, బేసిక్‌ ఫ్లాట్స్‌, సింపుల్‌ లేదా స్టైలిష్‌ షూస్‌ ఏవైనా నప్పుతాయి. మ్యాచింగ్‌తో వేసినా, కాంట్రాస్ట్‌ అయినా ముచ్చటగొల్పుతాయి. ఈ అమరికకు చూపరులు కళ్లు తిప్పుకోలేరంటే నమ్మండి.

* మిడీలో మోడ్రన్‌గానే కాక, హుందాగానూ ఉంటారు.

* మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో ప్యాంటుల కంటే మిడీలు అనువుగా ఉంటాయి.

* మిడీ మెటీరియల్‌ గురించి భయపడాల్సిన పనే లేదు. జీన్స్‌ మెటీరియల్‌, వెల్వెట్‌, బటన్‌ డౌన్‌ స్కర్టులు, ఫ్రిల్లీ స్కర్టులు.. ఇలా ఏ రకమైనా భేషుగ్గానే ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని