జుట్టుకి రంగు వేస్తున్నారా?
చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు ఎక్కువగా తెల్లబడటం చూస్తుంటాం. అలాంటప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైలను వాడుతుంటారు. దాంతో జుట్టు బలహీనంగా మారి రాలుతుంది.
చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు ఎక్కువగా తెల్లబడటం చూస్తుంటాం. అలాంటప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైలను వాడుతుంటారు. దాంతో జుట్టు బలహీనంగా మారి రాలుతుంది. అలాకాకుండా ఇంట్లోనే సహజంగా హెయిర్‌డైని తయారు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగో చూద్దామా..
బీట్‌రూట్‌తో..
బీట్‌రూట్‌ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో చెంచా తేనె, చెంచా కొబ్బరినూనె, కలిపి మెత్తని పేస్టులాగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంట తర్వాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. ఇది తలలో రక్తసరఫరాని మెరుగుపరిచి, జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.
కాఫీపొడితో..
అరకప్పు కాఫీ డికాక్షనుకు అరకప్పు హెయిర్ కండిషనర్ తీసుకోవాలి. దీంట్లో అరచెంచా కాఫీ పొడిని కలపాలి. ఇది జుట్టుకి సాధారణంగా మెరిసే రంగు వచ్చేలా కణాలను ఉత్తేజపరుస్తుంది. దీన్ని తలకి పట్టించి గంట తర్వాత చన్నీళ్లతో తలను శుభ్రం చేసుకుంటే సరి. కురులు సహజం నిగారింపు సంతరించుకుంటాయి.
దాల్చిన చెక్కతో..
అరకప్పు దాల్చినచెక్కపొడికి అరకప్పు కండిషనర్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. దాల్చినచెక్క మాడుకు పట్టించటం వల్ల కుదుళ్లకు తేమ అంది, సహజంగా మెరుస్తుంది.
ఇండిగోతో..
కప్పు హెన్నా పొడిలో మూడు చెంచాల పెరుగు వేసి తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ గట్టి మిశ్రమంలా కలపాలి. దాన్ని ఎనిమిది గంటల పాటు అలాగే వదిలేసి ఇందులోకి కప్పు ఇండిగో పొడి తీసుకోవాలి. ఈ రెండింటికీ సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు తలకు పట్టించి, నీళ్లతో కడగాలి. ఒక రోజు తర్వాతనే షాంపూ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. అంతే నల్లగా నిగనిగలాడే కురులు మీ సొంతమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.