పౌచ్‌లు కొత్తగా..
ఆధునిక, సంప్రదాయ దుస్తులన్నింటి పైనా.. ఆభరణాల్లాగే చేతిలో పౌచ్ కూడా తప్పనిసరి. సిల్కు, పట్టు అంటూ ఆడంబరంగా కనిపించే వీటి స్థానంలో ఇప్పుడు మృదువైన కాటన్ వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేసిన పౌచ్‌లు కొత్త ఫ్యాషన్‌గా మెరుస్తున్నాయి.
ఆధునిక, సంప్రదాయ దుస్తులన్నింటి పైనా.. ఆభరణాల్లాగే చేతిలో పౌచ్ కూడా తప్పనిసరి. సిల్కు, పట్టు అంటూ ఆడంబరంగా కనిపించే వీటి స్థానంలో ఇప్పుడు మృదువైన కాటన్ వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేసిన పౌచ్‌లు కొత్త ఫ్యాషన్‌గా మెరుస్తున్నాయి. పర్యావరణానికి పెద్దపీట వేస్తున్న నేటి తరం వీటిపై ఇప్పుడు మనసు పారేసుకుంటోంది. రంగుల దారాలతోపాటు ముత్యాలు, పూసలుసహా జర్దోసీ ఎంబ్రాయిడరీతో దేవతామూర్తుల చిత్రాలను రమ్యంగా డిజైనర్లు తీర్చి దిద్దుతున్నారు. కళాత్మకంగానే కాదు.. కొత్త ట్రెండ్‌గానూ కనిపిస్తున్న ఈ సింపుల్ పౌచ్‌లు భలేగున్నాయి కదూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.