అందానికి ఐస్‌ క్యూబ్‌లు!

ఎండలు మండిపోతున్నాయి. రెండు నిమిషాలు అలా బయటకి వెళ్లొస్తే చాలు... ముఖం కమిలిపోతోంది. ఇలాంటప్పుడు చల్లచల్లని ఐస్‌ క్యూబ్స్‌తో కాసేపు చర్మంపై మర్దన చేస్తే సరి. సాంత్వన అందడమే కాదు... ముఖమూ మెరిసిపోతుంది.

Published : 20 Apr 2023 00:47 IST

ఎండలు మండిపోతున్నాయి. రెండు నిమిషాలు అలా బయటకి వెళ్లొస్తే చాలు... ముఖం కమిలిపోతోంది. ఇలాంటప్పుడు చల్లచల్లని ఐస్‌ క్యూబ్స్‌తో కాసేపు చర్మంపై మర్దన చేస్తే సరి. సాంత్వన అందడమే కాదు... ముఖమూ మెరిసిపోతుంది. అయితే, ఆ క్యూబ్స్‌ని కేవలం నీళ్లతో కాకుండా.. వీటితో గడ్డకట్టించండి. అందంతో పాటూ ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది..

* గుప్పెడు గులాబీ రేకల్ని చేత్తో నలిపి ఓ గిన్నెలో వేయండి. అందులో చిన్నగా కత్తిరించిన కొన్ని తులసి ఆకులు కూడా వేసి నీళ్లు పోయండి. ఇప్పుడీ మిశ్రమాన్ని ట్రేలో పోసి ఐస్‌ క్యూబ్‌లుగా మార్చేయండి. ఎండతాలూకు మచ్చలు ముఖంపై కనిపిస్తున్నప్పుడు ఈ క్యూబ్‌తో రోజులో ఓ రెండు మూడు సార్లు రుద్ది చూడండి. క్రమంగా తగ్గిపోతాయి.

* ఎండకు చర్మమంతా నల్లగా మారిందా? నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ట్రేలో పెట్టండి. ఆపై ఓ చుక్క తేనె కూడా వేసి...కాసిన్ని నీళ్లుపోయండి. ఆ మిశ్రమం గడ్డకట్టాక బయటకు తీసి సున్నితంగా ముఖంపై మర్దన చేస్తే చర్మానికి ఉపశమనం లభిస్తుంది. రంగూ మారుతుంది.

* గ్రీన్‌ టీ, గులాబీ నీళ్లను సమాన పరిమాణాల్లో తీసుకుని ఫ్రీజర్‌లో పెట్టాలి. క్యూబ్స్‌గా మారిన తర్వాత వీటితో ముఖానికి అద్దితే...ఎండకు కమిలిన చర్మం తిరిగి పునరుత్తేజితమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని