వయసును వాయిదా వేద్దాం..
వయసు పైబడే కొద్దీ వృద్ధాప్య ఛాయలు కనిపించటం సహజమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, వయసు కనబడనీయదు. ఆ చిట్కాలను మీరూ ప్రయత్నిస్తారా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు బాగా తీసుకోవాలి.
వయసు పైబడే కొద్దీ వృద్ధాప్య ఛాయలు కనిపించటం సహజమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, వయసు కనబడనీయదు. ఆ చిట్కాలను మీరూ ప్రయత్నిస్తారా..
* చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు బాగా తీసుకోవాలి. శరీరంలో జీవక్రియలన్నీ సరిగా జరగాలంటే సరైన నిద్ర అవసరం. అందుకే రోజులో కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.
* ఎండలో బయటకు వెళ్లాల్సివస్తే సన్‌స్క్రీన్ లోషన్, తలకు టోపీ, శరీరాన్ని మొత్తం కప్పి ఉంచే దుస్తులు తప్పనిసరి.
* నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటే మంచిది. బరువుని అదుపులో ఉంచుకునేందుకు రోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి.
* దంత సమస్యలు కూడా అసలు వయసు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. అందుకే పళ్లు, చిగుళ్లనూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి తగ్గి చర్మం నిర్జీవమవకుండా ఉంటుంది.
* ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. చర్మసంరక్షణకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు ముఖాన్ని ఫేషియల్ ఆయిల్‌తో మర్దనా చేసుకుంటుంటే రక్తప్రసరణ మెరుగుపడి చర్మం కాంతులీనుతుంది.
ఇంకా.. అందమంటే కేవలం బాహ్య సౌందర్యమే కాదు. అంతఃసౌందర్యం కూడా. ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, దయ, ఇతరులను గౌరవించే తత్వం ఇవన్నీ మన అందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.