మర్దనాతో మరింత మెరుపు

ఎంత జాగ్రత్త తీసుకున్నా,  చర్మం పొడిబారటం, గరుకుచర్మం వంటి సమస్యలు ముఖంలో కళ లేకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు ఫేషియల్‌ ఆయిల్‌తో మర్దనా చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు.. ఫేషియల్‌ ఆయిల్స్‌లోని ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మం మృదువుగా ఉండేందుకు దోహదపడతాయి.

Published : 28 Apr 2023 00:42 IST

ఎంత జాగ్రత్త తీసుకున్నా,  చర్మం పొడిబారటం, గరుకుచర్మం వంటి సమస్యలు ముఖంలో కళ లేకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు ఫేషియల్‌ ఆయిల్‌తో మర్దనా చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు..

ఫేషియల్‌ ఆయిల్స్‌లోని ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మం మృదువుగా ఉండేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న వారిలో తేమను పదిలపరచి పొడిబారకుండా చేస్తుంది.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం పాడవకుండా చేస్తాయి. ముడతలు, మచ్చలు లేకుండా లేకుండా చేయటమే కాదు వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా చేస్తాయి.

ఫేషియల్‌ ఆయిల్‌ని మేకప్‌ వేసుకునే ముందు ప్రైమర్‌లా కూడా రాసుకోవచ్చు. తరువాత మేకప్‌ వేసుకుంటే మనం వాడే ఇతర సౌందర్య ఉత్పత్తులు చర్మంలోకి చొచ్చుకుపోయేలా చేసి మంచి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఈ నూనెలు చర్మాన్ని నునుపుగా చేసి మోము కాంతులీనేలా చేయగలవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని