సహజ స్క్రబ్‌లివీ!
చర్మ సంరక్షణలో మృతకణాలు తొలగించటం చాలా ముఖ్యం. లేదంటే ముఖంపై మురికి, ధూళి పేరుకుపోయిన చోట నల్లమచ్చలు, మొటిమలూ వస్తాయి. ప్రతిసారీ వీటి కోసం మార్కెట్లో దొరికే స్క్రబ్‌లు వాడతాం.
చర్మ సంరక్షణలో మృతకణాలు తొలగించటం చాలా ముఖ్యం. లేదంటే ముఖంపై మురికి, ధూళి పేరుకుపోయిన చోట నల్లమచ్చలు, మొటిమలూ వస్తాయి. ప్రతిసారీ వీటి కోసం మార్కెట్లో దొరికే స్క్రబ్‌లు వాడతాం. వాటికి బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు.
* అరకప్పు పంచదారకు రెండు చెంచాల ఆలివ్‌నూనె చేర్చండి. మూత బిగుతుగా ఉన్న గాజు సీసాలో భద్రపరచుకోండి. దీన్ని వారంలో రెండు మూడు సార్లు ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఆపై పది నిమిషాలాగి చల్లటినీళ్లతో కడిగేస్తే సరి. మేను నిగనిగలాడుతుంది.
* మూడు చెంచాల చాక్లెట్ పొడిలో రెండు చెంచాల కొబ్బరి నూనెను కలపాలి. ఇది ముఖానికి మంచి స్క్రబ్. కాస్త ఆరాక...చేతుల్ని నీళ్లతో తడిపి వేళ్లతో మృదువుగా మర్దన చేయండి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా, మెరిసిపోతుంది.
* మూడు చెంచాల చక్కెరలో మూడు చెంచాల తేనె, చెంచా నిమ్మరసం కలపాలి. ఈ స్క్రబ్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇది మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిపించి, ముఖాన్ని కాంతులీనేలా చేస్తుంది.
* రెండు చెంచాల ఓట్స్‌లో కాసిని పాలు, చెంచా ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్ మెత్తబడే వరకూ అలాగే వదిలేసి... తర్వాత కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. ఆపై సున్నితంగా రుద్దుతూ కడిగేస్తే సరి. చర్మం మృదువుగా మారి యవ్వనంగా కనిపిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.