ఆముదం అందానికి ఔషధం!

ఆముదం అనగానే...ముఖం అదోలా పెట్టేస్తాం... కానీ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, అందాన్ని కాపాడటంలోనూ దీని పాత్ర తెలిస్తే ‘ఔరా’ అని ఆశ్చర్యపోతాం. మరి అవేంటో తెలుసుకుందామా! చర్మ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం, మొటిమలు రావడం, కాలుష్యం...ఇలా వివిధ కారణాలతో ముఖం నిర్జీవంగా మారుతుంది.

Published : 10 May 2023 00:26 IST

ఆముదం అనగానే...ముఖం అదోలా పెట్టేస్తాం... కానీ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, అందాన్ని కాపాడటంలోనూ దీని పాత్ర తెలిస్తే ‘ఔరా’ అని ఆశ్చర్యపోతాం. మరి అవేంటో తెలుసుకుందామా!

చర్మ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం, మొటిమలు రావడం, కాలుష్యం...ఇలా వివిధ కారణాలతో ముఖం నిర్జీవంగా మారుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆముదం చక్కగా ఉపయోగపడుతుంది. తేలిగ్గా ఇంకిపోయే గుణాలు కలిగిన ఈ తైలం...చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి ఆముదాన్ని ముఖానికి మర్దన చేసి చూస్తే ఫలితం మీకే అర్థమవుతుంది.  

ఈ రోజుల్లో వేడుకలప్పుడే కాదు...ఉద్యోగాలకూ మేకప్‌ అవసరమే అంటున్నారు. దీర్ఘకాలంలో దీన్ని వాడటం వల్ల  చర్మం తన కాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాకాకూడదంటే... మేకప్‌ తీసేశాక రెండు చుక్కల ఆముదాన్ని ముఖానికి రాసి  మర్దన చేయండి. ఇది చర్మానికి తగిన తేమ, విటమిన్‌ ఎ, సి వంటి పోషకాలను అందించి నిగనిగలాడేలా చేస్తుంది.

ఆముదం చర్మాన్నే కాదు...జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరగాలన్నా, అవి పట్టుకుచ్చుల్లా మెరిసిపోవాలన్నా... ఆముద పోషణ అవసరమంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకు రెండు చెంచాల ఆముదానికి పావు కప్పు కొబ్బరినూనె, చిటికెడు మెంతులు కలిపి మరిగించి తలకు రాస్తే సరి.

ఎక్కువ సేపు కంప్యూటర్లూ, ఫోనులూ చూసిన అలసట, పని ఒత్తిడి, నిద్రలేమి.... వంటి వాటితో కళ్లు కళ తప్పుతాయి. కంటికింద నలుపు, క్యారీ బ్యాగులూ వస్తాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చని ఆముదాన్ని ఆ ప్రదేశంలో రాసి మునివేళ్లతో మృదువుగా రుద్దుతూ ఉండాలి. ఇలా రోజూ రాత్రి పూట రాస్తుంటే సమస్య దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని