మెరిసే మోచేతుల కోసం...
ముఖమెంత అందంగా ఉన్నా... మోచేతులు మాత్రం నల్లగా ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. కంగారు పడిపోనక్కర్లేదు. ఈ చిట్కాలతో వాటిని మెరిపించండి.
ముఖమెంత అందంగా ఉన్నా... మోచేతులు మాత్రం నల్లగా ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. కంగారు పడిపోనక్కర్లేదు. ఈ చిట్కాలతో వాటిని మెరిపించండి...
* రోజూ నిద్రపోయే ముందు రెండు చెంచాల కొబ్బరి నూనెలో చెంచా తులసి ఆకుల పొడివేసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ తైలాన్ని మోచేతులకు రాసుకుని 15 నిమిషాలు సున్నితంగా మర్దన చేయాలి. దీని వల్ల ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి, ఏలు... చర్మానికి తగిన తేమ నందించి మృదువుగా మారుస్తాయి. క్రమంగా రంగూ మారుతుంది.
* చర్మం నల్లగా మారడానికి దానిపై ఒత్తిడి పెట్టడం కూడా కారణమే. ఈ ప్రాంతం గట్టిపడకుండా రోజూ తప్పని సరిగా మాయిశ్చరైజర్ రాయాలి. అలానే వారానికి రెండు సార్లు రెండు చెంచాల వంటసోడా, కాసిని పాలు, కొద్దిగా పసుపు తీసుకుని పూతలా వేయాలి.
* నలుపుదనం పోవడంతో పాటు... నునుపుగా మారాలంటే... పెసరపిండిలో కాస్త నిమ్మరసం, కొద్దిగా బేబీ ఆయిల్ కలిపి అక్కడ రాయాలి. కాసేపు ఆరనిచ్చి చేతులు తడుపుతూ మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. మృతకణాలు తొలగి మోచేతులూ చక్కగా ఉంటాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.