ఆధునిక హంగులతో కొల్హాపుర్..
కొల్హాపురి ఫ్యాషన్లంటేే నచ్చనిదెవరికి చెప్పండి.. అయితే ఇదొకప్పటి ట్రెండ్ అంటారా! కాదండోయ్.. నేటికీ కొల్హాపురి నగలు, చెప్పులు ధరించాలని ఆరాట పడే మహిళలు చాలామందే. అలాంటి వారి కోసమే.. ‘ఐరా సోల్స్’ పేరిట మహారాష్ట్రకి చెందిన ఇమ్రాన్ రిజ్వి కొల్హాపురి బ్రాండ్‌తో ఆధునిక మోడళ్లతో చెప్పులను అందుబాటులోకి తెచ్చారు.
కొల్హాపురి ఫ్యాషన్లంటేే నచ్చనిదెవరికి చెప్పండి.. అయితే ఇదొకప్పటి ట్రెండ్ అంటారా! కాదండోయ్.. నేటికీ కొల్హాపురి నగలు, చెప్పులు ధరించాలని ఆరాట పడే మహిళలు చాలామందే. అలాంటి వారి కోసమే.. ‘ఐరా సోల్స్’ పేరిట మహారాష్ట్రకి చెందిన ఇమ్రాన్ రిజ్వి కొల్హాపురి బ్రాండ్‌తో ఆధునిక మోడళ్లతో చెప్పులను అందుబాటులోకి తెచ్చారు. ఇవి సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణలన్నింటి మీదకూ నప్పేస్తాయి. ఒకప్పుడు కొల్హాపురీ రకాలంటే ఫ్లాట్స్ మాత్రమే దొరికేవి. కానీ, ఇప్పుడు రెట్రో హీల్స్, జల్సా బ్లాక్, ఫలక్ ఫ్లాక్స్ వంటి నయా మోడళ్లెన్నింటినో యువతను మెప్పించేందుకు తీసుకొచ్చారు రిజ్వి. వీటితోపాటు పదుల సంఖ్యలో చేతి వృత్తుల వారికీ ఉపాధినిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.