అలసినా.. అందంగా..
ఎడతెరిపి లేని షూటింగ్‌లతో అలసిపోయుంటానా.. అప్పుడే ముఖ్యమైన వారిని కలవాల్సి ఉంటుంది. లోపలి అలసటను చిరునవ్వుతో కప్పేయొచ్చు. మరి ముఖం? చర్మమేమో నిర్జీవంగా కళ తప్పి కనిపిస్తుంటుంది. మేకప్‌పైకి మనసు పోదు. అయినా ముఖం తాజాగా, మెరిసేలా కనిపించడానికి ఓ చిట్కా పాటిస్తుంటా. ముఖాన్ని నీళ్లతో కడిగి, తడిలేకుండా తుడవాలి.
ఎడతెరిపి లేని షూటింగ్‌లతో అలసిపోయుంటానా.. అప్పుడే ముఖ్యమైన వారిని కలవాల్సి ఉంటుంది. లోపలి అలసటను చిరునవ్వుతో కప్పేయొచ్చు. మరి ముఖం? చర్మమేమో నిర్జీవంగా కళ తప్పి కనిపిస్తుంటుంది. మేకప్‌పైకి మనసు పోదు. అయినా ముఖం తాజాగా, మెరిసేలా కనిపించడానికి ఓ చిట్కా పాటిస్తుంటా. ముఖాన్ని నీళ్లతో కడిగి, తడిలేకుండా తుడవాలి. తర్వాత ఆవిరి పట్టాలి. ఒక గిన్నెలో చెంచా పెరుగు, కొద్దిగా తేనె, రెండు చెంచాల అరటిపండు గుజ్జు వేసి, బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలు వదిలేయాలి. ఇది చర్మానికి తేమతోపాటు పోషణనిస్తుంది. ఇప్పుడు సగం కోసిన నారింజ తీసుకొని విత్తనాలు తీసి, దాంతో ముఖంపై కొద్దిసేపు వలయాకారంలో రుద్ది, కొన్ని నిమిషాలు వదిలేయాలి. ఇది టాన్, మృతకణాలను తొలగిస్తుంది. రెండు మూడు నిమిషాలయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే సరి. కళ్లకింద బాదంనూనె రాసి మర్దనా చేస్తే తాజాగా కనిపిస్తాయి. మాయిశ్చరైజర్, కాస్త లిప్‌బామ్.. ఎండ ఉంటే సన్‌స్క్రీన్ రాస్తా. అంతే.. ఫ్రెష్ లుక్ సొంతమవుతుంది. మీరూ ప్రయత్నించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.