తాజా చర్మం కావాలా...

అందంగా కనిపించేందుకు వివిధ రకాల ఫేస్‌ప్యాక్‌లను, మేకప్‌లను వాడుతుంటాం. వాటిల్లో ఇంట్లో సహజంగా తయారు చేసుకున్నవైతే మేలు. అలా సులువుగా తయారుచేసుకోగలిగే వాటిల్లో పాలు ఒకటి. అదెలాగో తెలుసుకుందామా!

Published : 17 May 2023 00:25 IST

అందంగా కనిపించేందుకు వివిధ రకాల ఫేస్‌ప్యాక్‌లను, మేకప్‌లను వాడుతుంటాం. వాటిల్లో ఇంట్లో సహజంగా తయారు చేసుకున్నవైతే మేలు. అలా సులువుగా తయారుచేసుకోగలిగే వాటిల్లో పాలు ఒకటి. అదెలాగో తెలుసుకుందామా!

* చర్మం ముడతలు పడకుండా కాపాడేందుకు పాలు చక్కగా తోడ్పడతాయి. వృద్ధాప్యం వల్ల ముడతలు రావటం సహజమే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో యువతే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటోంది. కాబట్టి రోజూ స్నానం చేసే నీళ్లలో రెండు చెంచాల పాలను కలుపుకొంటే ప్రయోజనం ఉంటుంది.

* చర్మసంరక్షణలో భాగంగా చర్మాన్ని క్రమం తప్పకుండా రోజూ ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. పాలను నేరుగా శరీరంపై రాసుకొని మర్దనా చేయాలి. లేకపోతే సెనగపిండి, బియ్యప్పిండిలోనైనా కలుపుకొని రాసుకున్నా మంచి స్క్రబర్‌లాగా పనిచేస్తుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.

* ఎండ వేడికి చర్మం పొడిబారి టాన్‌ అయిపోతుంది. పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ సూర్యరశ్మికి వాడిపోయిన చర్మానికి జీవం పోస్తుంది. పచ్చిపాలలో కొద్దిగా దూది తీసుకొని ముంచి ముఖానికి రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.

* ఓ చెంచా గంధంలో కొద్దిగా పాలు పోసి కలుపుకొని దాన్ని ఫేస్‌ప్యాక్‌లా రాసుకోవాలి. గంధం చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మృతకణాలను తొలగిస్తుంది. తరచూ ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. అంతే కాక చర్మం కాంతులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్