మేకప్‌తోనే నిద్రపోతున్నారా...

ఇప్పుడు మేకప్‌ వేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. చాలామంది ఇది లేనిదే బయటికి రావడం లేదు. మరి వేసుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధా, ఆసక్తీ తీసేటప్పుడు ఉంటుందా...? అలసిపోయో, ఏమవుతుందిలే అనో మేకప్‌తోనే నిద్రపోతున్నారా...? ఈ నిర్లక్ష్యం మంచిది కాదంటున్నారు నిపుణులు.

Published : 18 May 2023 00:07 IST

ఇప్పుడు మేకప్‌ వేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. చాలామంది ఇది లేనిదే బయటికి రావడం లేదు. మరి వేసుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధా, ఆసక్తీ తీసేటప్పుడు ఉంటుందా...? అలసిపోయో, ఏమవుతుందిలే అనో మేకప్‌తోనే నిద్రపోతున్నారా...? ఈ నిర్లక్ష్యం మంచిది కాదంటున్నారు నిపుణులు. మేకప్‌తోనే నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలను వివరిస్తున్నారిలా.

వృద్ధాప్య ఛాయలు... మేకప్‌తో నిద్రపోవడం అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. ఎందుకంటే చర్మం మేకప్‌తో కప్పి ఉండటం వల్ల గాలిసరిగ్గా తగలదు. దీనివల్ల కాలక్రమేణా గీతలు, ముడతలు ఏర్పడతాయి. అందుకే నిద్రపోయే ముందు సున్నితమైన క్లెన్సర్లు, రిమూవర్లతో దీన్ని తొలగించాలి. మాయిశ్చరైజర్లను రాసుకుంటే రాత్రంతా చర్మం తేమగా ఉంటుంది.

మొటిమలు... చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమల బారిన పడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల నల్లటి మచ్చలూ ఏర్పడొచ్చు. అల్ట్రా హైజినిక్‌ సిలికాన్‌తో తయారు చేసిన బ్రష్‌లతో మేకప్‌ తీయడం మంచిదని వైద్యపరంగా నిరూపితమైంది. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.

కళ్లకూ ప్రమాదమే... మేకప్‌తో నిద్రపోవడం వల్ల చర్మానికి మాత్రమే కాదు కళ్లకూ ప్రమాదమే. దురద, దద్దుర్లు, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. అలానే, రాత్రుళ్లు మేకప్‌ తీయకపోతే కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గి చర్మం పొడిబారిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని