అద్దానికి మండల కళ!

ఆసక్తి ఉంటే చాలు... అలంకరణలో అద్భుతాలెన్నో చేయొచ్చు. ఆధునిక, సంప్రదాయ కళల మేళవింపుతో ఆవిష్కరణలెన్నో తెచ్చేయొచ్చు.

Updated : 18 May 2023 04:01 IST

ఆసక్తి ఉంటే చాలు... అలంకరణలో అద్భుతాలెన్నో చేయొచ్చు. ఆధునిక, సంప్రదాయ కళల మేళవింపుతో ఆవిష్కరణలెన్నో తెచ్చేయొచ్చు. అలాంటిదే ఈ ‘మండల ఆర్ట్‌ వాల్‌ మిర్రర్‌’ కూడా. బౌద్ధ, హిందూ మతాల్లో ప్రాముఖ్యత సంపాదించుకున్న ఈ కళను అతివలెంతగానో ఇష్టపడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి ముంగిట మన రంగవల్లిలానూ వేస్తుంటారు. ఇది ఇప్పుడు ఇంటీరియర్‌లోనూ భాగమైంది. ముఖ్యంగా గుండ్రటి పెద్ద అద్దం చుట్టూ అక్రిలిక్‌ రంగులూ, వైట్‌సిమెంట్‌, చిన్న చిన్న మిర్రర్‌లతో మండల డిజైన్‌ని తీర్చిదిద్దుతున్నారు. దీన్ని గోడకు తగిలిస్తే చాలు ఆ ప్రదేశమంతా వెలిగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని