శరీరాకృతి బట్టి దుస్తులు...
మధుర కాస్త కురచగా ఉన్నాకూడా.. ఆమె ధరించే దుస్తులన్నీ అందాన్ని పెంచినట్లుంటాయి. అయితే రాధికకు మంచి పర్సనాలిటీ, ఖరీదైన దుస్తులు కూడా ఆకర్షణీయంగా కనిపించవు.
మధుర కాస్త కురచగా ఉన్నాకూడా.. ఆమె ధరించే దుస్తులన్నీ అందాన్ని పెంచినట్లుంటాయి. అయితే రాధికకు మంచి పర్సనాలిటీ, ఖరీదైన దుస్తులు కూడా ఆకర్షణీయంగా కనిపించవు. మనసుకు నచ్చినట్లు మాత్రమే కాకుండా, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.
పర్సనాలిటీ బట్టి దుస్తులను ఎంచుకొంటే చాలు. అందంగా, నలుగురిలో ప్రత్యేకంగా నిలవొచ్చు. అద్దంలో చూసుకొన్నప్పుడు మనసుకు తృప్తి, దాంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బేరిపండు, యాపిల్, హవర్‌గ్లాస్, దీర్ఘచతురస్రం, త్రికోణం అంటూ పలురకాల శరీరాకృతులుంటాయి. వీటిలో మనది ఏ రకమైనదో మొదట గుర్తించాలి. ఆ తర్వాత ఎలాంటి అవుట్‌ఫిట్స్ నప్పుతాయో తెలుసుకొని ఎంచుకోవాలి.
ప్రత్యేకత.. శరీరాకృతితోపాటు శరీరంలో ప్రత్యేకతనూ గుర్తించాలి. అలాగే లోపంగా అనిపించే ప్రాంతాన్నీ తెలుసుకోగలగాలి. రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నించాలి. సన్నని నడుము ఉన్నప్పుడు టైట్‌ఫిట్‌గా బెల్ట్ ఉన్న డ్రెస్ నప్పుతుంది. హై వెయిస్టెడ్ ప్యాంటుకూడా ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. భుజాల కింద నుంచి చేతులు మృదువుగా ఉంటే స్లీవ్‌లెస్ లేదా ఆఫ్ షోల్డర్ టాప్ ధరించాలి. భుజాలవద్ద చేతులు లావుగా ఉన్నవారు పొడవు లేదా మోచేతుల వరకు వచ్చేలా టాప్స్ ఎంచుకొంటే సరిపోతుంది.
సమన్వయం.. బేరిపండు ఆకృతి ఉన్నవారు నడుం కింది భాగాన్ని హైలైట్ కానివ్వకుండా పైభాగాన్ని సమన్వయం చేయాలి. స్ట్రెయిట్ లెగ్ ప్యాంట్లు, వీటిపై ఆకర్షణీయంగా కనిపించే టాప్ లేదా టైట్‌ఫిట్ బ్లేజర్ వంటివి ఎంపిక చేయాలి. అప్పుడే దుస్తుల్లో ప్యాంటు లేదా స్కర్టుకన్నా టాప్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే యాపిల్ ఆకృతి ఉన్నవారు పొడవుగా అనిపించేలా దుస్తులెంచుకోవాలి. వదులైన ప్యాంటు, వీ నెక్ టాప్, దానిపై పొడవైన చెయిన్ వంటివి అధిక బరువున్నట్లు తెలియదు. స్ట్రెయిట్ షేప్డ్ వారికి రఫుల్డ్ టాప్స్, స్కిన్నీ జీన్స్, ఒంటికి పట్టినట్లుండే స్కర్టు మంచి ఎంపిక అవుతుంది. భుజాల నుంచి నడుము కింది భాగం వరకు ఒకేలా ఉండే హవర్‌గ్లాస్ ఆకారానికి ఏ లైన్ డ్రస్, వీ షేప్డ్ నెక్‌లైన్స్ టాప్స్ బాగుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.