మర్దన చేస్తే మెరిసిపోతుంది
కాలం ఏదైనా, కారణాలు ఎన్ని చెప్పినా నిత్యం ఒత్తిడి విసిరే సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితికి చెక్ చెప్పి సాంత్వన పొందేందుకు మర్దన ఎంతో మేలు చేస్తుంది అంటారు సౌందర్య నిపుణులు.
కాలం ఏదైనా, కారణాలు ఎన్ని చెప్పినా నిత్యం ఒత్తిడి విసిరే సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితికి చెక్ చెప్పి సాంత్వన పొందేందుకు మర్దన ఎంతో మేలు చేస్తుంది అంటారు సౌందర్య నిపుణులు.
* లావెండర్, మల్లె, గులాబీ వంటి పూల పరిమళాల్లో సాంత్వననిచ్చే సుగుణాలెన్నో ఉన్నాయట. మరి ఇంకేం...అలాంటి పూల సుగంధాల నూనెల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని పావు కప్పు బాదం నూనెలో ఓ రెండు చుక్కల ఈ సువాసన తైలాన్ని కలిపి ఒంటికి రాసి మర్దనా చేయండి. ఒంట్లో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మేను వన్నెలీనుతుంది.
* కొబ్బరినూనె వేడి చేసి దానికి కాస్త తేనె, చిటికెడు కర్పూరం పొడిచేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసి మృదువుగా మర్దన చేయండి. ఇది ఒంటి మీద ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది. ఇలా కనీసం వారంలో రెండు సార్లైనా చేస్తుంటే ఒత్తిడీ పరారవుతుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.