కండిషనర్‌ ఇలా కూడా!

కొన్ని ఉత్పత్తులు గడువు దాటితే ఏం చేయాలో తెలియదు. దీంతో చెత్తబుట్ట పాలు చేస్తాం. అలాంటి వాటిల్లో కండిషనర్‌ ఒకటి.

Published : 08 Jun 2023 00:11 IST

కొన్ని ఉత్పత్తులు గడువు దాటితే ఏం చేయాలో తెలియదు. దీంతో చెత్తబుట్ట పాలు చేస్తాం. అలాంటి వాటిల్లో కండిషనర్‌ ఒకటి. కానీ దీన్ని ఎన్నో రకాలుగా తిరిగి ఉపయోగించుకోవచ్చని తెలుసా?

* పొడిబారిన పాదాలు, పగుళ్లా? రాత్రిపూట ఈ కండిషనర్‌ రాసి మృదువుగా మర్దనా చేయండి. తడి ఆరాక సాక్సులు వేసుకొని పడుకొంటే సరి. ఓ వారం ఇలా చేస్తే పాదాల చర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు.. పగుళ్లూ తగ్గుతాయి.

* దీన్ని చేతివేళ్ల సంరక్షణకీ ఉపయోగించొచ్చు. వేళ్లు అందంగా కనిపించడానికి క్యుటికల్స్‌, గోళ్లు తొలగిస్తుంటాం కదా! దానికి 5 నిమిషాల ముందు కండిషనర్‌ పట్టించి, మృదువుగా మర్దనా చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి మానిక్యూర్‌ చేసుకుంటే సరి. పని తేలిక అవుతుంది.

* బిగుతుగా అయిన గాజులు, ఉంగరాలను తీయడానికి సబ్బు నురగను ఉపయోగిస్తాం కదా! పాత కండిషనర్‌ని వాడినా పని తేలిక అవుతుంది. గట్టిగా మారిన గడియలు, సరిగా పనిచేయని జిప్‌లకి దీన్ని రాయండి. తిరిగి గాడిలో పడతాయి.

* కళ తప్పిన చెప్పులు, బూట్లను ఈ కండిషనర్‌లో ముంచిన వస్త్రంతో తుడిచి చూడండి. తిరిగి మెరవడమే కాదు.. త్వరగా లెదర్‌ పాడవదు కూడా. దీంతో స్టవ్‌, ట్యాపులు, సింకు వంటివీ శుభ్రం చేయొచ్చు.

* పిల్లల పెయింట్‌ బ్రష్‌లు ఒక్కోసారి గట్టి పడి పనికిరాకుండా పోతాయి. వాటిని ఈ కండిషనర్‌ కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టి చూడండి. తిరిగి ఎంచక్కా వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్