అందానికి ఆ మాత్రం చేయాలిగా!
నటిని.. అందానికి పూర్తిగా మేకప్‌పైనే ఆధారపడాలనుకోను. సహజ సౌందర్యం ముఖ్యమనుకుంటా. అలాగని ఎవరినో అనుసరించను. ఒక్కొక్కరి చర్మతీరు ఒక్కోలా ఉంటుంది మరి! స్కిన్ కేర్ రొటీన్‌కి చాలా ప్రాధాన్యమిస్తా.
కృతి సనన్, నటి
నటిని.. అందానికి పూర్తిగా మేకప్‌పైనే ఆధారపడాలనుకోను. సహజ సౌందర్యం ముఖ్యమనుకుంటా. అలాగని ఎవరినో అనుసరించను. ఒక్కొక్కరి చర్మతీరు ఒక్కోలా ఉంటుంది మరి! స్కిన్ కేర్ రొటీన్‌కి చాలా ప్రాధాన్యమిస్తా. మనకు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి పోషణ కావాలి కదా! చర్మమూ అంతే. ఎండలోకి వెళ్లినా, లైట్లు, షూట్లతో అది నీరసపడొద్దంటే ముందుగానే సిద్ధం చేయాలి. అందుకే ఆ పోషకాలు అందే ఉత్పత్తులను వాడతా. సహజ అందం కావాలంటే తప్పదుగా మరి. పగలు.. లోతైన శుభ్రతకు డబుల్ క్లెన్సింగ్ చేస్తా. చర్మ కణాలకు ఇబ్బంది కలగొద్దని ముఖానికి మైక్రో ఫైబర్ టవల్స్‌నే ఉపయోగిస్తా. పూర్తిగా తుడిచేయను, తడిపొడిగా ఉండేలా చూసుకుంటా. తర్వాత గ్రీన్ టీ నియాసినమైడ్ టోనర్ రాస్తా. దీంతో తేమతోపాటు పోషకాలూ అందుతాయి. ఆపై విటమిన్ సి సీరమ్, పెప్టైడ్స్, సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, పెదాలకు లిప్‌బామ్.. అంతే! రాత్రికి మేకప్ తొలగించాక డబుల్ క్లెన్సింగ్ చేస్తా. నియాసినమైడ్ టోనర్ రాశాక, పెప్టైడ్స్, హైలురోనిక్ యాసిడ్‌తోపాటు రెటినాల్ సీరమ్‌నీ అప్లై చేస్తా. దానిపై సెరమైడ్స్ మాయిశ్చరైజర్ క్రీమ్.. పెదాలకు లిప్ బామ్ రాస్తా. కనుబొమలకు ఆలివ్ నూనె లేదా ఆముదం పట్టిస్తా. పని నుంచి విరామం దొరికినా.. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉండి.. నా చర్మం దానికి తగ్గట్టుగా లేదనిపించినా మాస్క్ వేస్తా. సాధారణంగా వారానికి ఒకటి నుంచి రెండు సార్లు దీన్ని ప్రయత్నిస్తుంటా. నాకు తగినవేంటో తెలుసుకోవడానికి ఎన్నింటిని ప్రయత్నించి ఉంటానో. అవి నా చర్మంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి, మెచ్చిన వాటిని కొనసాగిస్తుంటా. మీరైనా అంతే.. ఎవరినో అనుసరించొద్దు. మీకు తగినవేంటో స్వయంగా తెలుసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.