మేకప్‌ బ్రష్‌ శుభ్రం చేసుకోండిలా...

మీకు మేకప్‌ వేసుకోవడమంటే ఇష్టమా! అయితే, వేసుకున్న ప్రతిసారీ ఆ వస్తువులను శుభ్రం చేసుకోవడం మాత్రం మరిచిపోవద్దు. లేదంటే... దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ముఖంపై చేరి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు.

Published : 12 Jun 2023 00:22 IST

మీకు మేకప్‌ వేసుకోవడమంటే ఇష్టమా! అయితే, వేసుకున్న ప్రతిసారీ ఆ వస్తువులను శుభ్రం చేసుకోవడం మాత్రం మరిచిపోవద్దు. లేదంటే... దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ముఖంపై చేరి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. ఎలా శుభ్రం చేసుకోవాలంటారా...

* బ్రష్‌లను వాడాక మొదట గోరువెచ్చని నీళ్లతో కడగాలి. తర్వాత మరోసారి బేబీ సోప్‌ లేదా షాంపూ కలిపిన నీళ్లతో శుభ్ర పరచాలి. ఆపై  మెత్తని వస్త్రంపై ఆరబెడితే సరి.

* ఒక గిన్నెలో కాచి చల్లార్చిన వేడి నీటిని పోసి అందులో కాస్త బేకింగ్‌ సోడా కలిపి... ఫౌండేషన్‌ బ్రష్‌, పౌడర్‌ స్పాంజ్‌లను కాసేపు నాననివ్వండి. ఆపై షాంపూతో కడిగేయండి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే వాటిలో చేరిన బ్యాక్టీరియా నశిస్తుంది.

* ఒక గిన్నెలోకి వేణ్నీళ్లు తీసుకుని అందులో రెండు టీస్పూన్ల వెనిగర్‌, నిమ్మరసం కలిపి అందులో బ్రష్‌లు నానబెట్టాలి.వెనిగర్‌, నిమ్మ రసం ఈ రెండూ క్రిములను యంత్రించడంలో సహాయపడతాయి.

* మేకప్‌ బ్రష్‌ల మీద మృతకణాలు, బ్యాక్టీరియా... వంటి ఎన్నో అవశేషాలు చేరి చర్మ సంబంధిత సమస్యలకు కారణం కావొచ్చు. నిత్యం మేకప్‌ని వేసుకునేవారు వారానికోసారైనా బ్రష్‌లను శుభ్రం చేయాలి. అయితే, ఐలైనర్‌, ఫౌండేషన్‌ బ్రష్‌లను (క్రీమ్‌ ఆధారిత ఉత్పత్తులు) వాడిన ప్రతిసారీ క్లీన్‌ చేయాలి.

* బ్రష్‌ని శుభ్రం చేసేటప్పుడు కుచ్చు మాత్రమే మునిగేలా చూసుకోవాలి. లేదంటే బ్రష్‌ వదులై పాడయ్యే అవకాశం ఉంది. గోరువెచ్చని నీళ్లల్లో చెంచా రాళ్ల ఉప్పు కలిపి ఒక నిమిషం ముంచి తీయాలి. ఆపై బేకింగ్‌ సోడా కలిపిన చల్లటి నీళ్లలో ముంచి శుభ్రపరచాలి. ఇలా చేయడం వల్ల బ్రష్‌ మెత్తగా, మన్నికగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని