ఏ మేకప్ బ్రష్ వాడుతున్నారు?
మేకప్ వేసుకోవాలనుకునే వారు మొదట ఆలోచించేది ఎలాంటి బ్రష్‌లు ఎంచుకోవాలనే! అసలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకుంటే...ఎంతందంగా వేసుకోవచ్చో అర్థమైపోతుంది. ఫౌండేషన్ ముఖమంతా సమానంగా పరుచుకునేందుకు ఈ బ్రష్‌ని వాడతారు. దీని కుచ్చులు కాస్త మందంగా ఉంటాయి. వాడే ముందు గోరువెచ్చని నీటిలో ముంచి తువాలు లేదా టిష్యూతో తుడిచి తర్వాత మేకప్ ప్రారంభిస్తే ముద్దలు ముద్దలుగా అతుక్కోదు.
మేకప్ వేసుకోవాలనుకునే వారు మొదట ఆలోచించేది ఎలాంటి బ్రష్‌లు ఎంచుకోవాలనే! అసలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకుంటే...ఎంతందంగా వేసుకోవచ్చో అర్థమైపోతుంది.
ఫౌండేషన్ బ్రష్..: ఫౌండేషన్ ముఖమంతా సమానంగా పరుచుకునేందుకు ఈ బ్రష్‌ని వాడతారు. దీని కుచ్చులు కాస్త మందంగా ఉంటాయి. వాడే ముందు గోరువెచ్చని నీటిలో ముంచి తువాలు లేదా టిష్యూతో తుడిచి తర్వాత మేకప్ ప్రారంభిస్తే ముద్దలు ముద్దలుగా అతుక్కోదు.
కన్సీలర్ బ్రష్... ఇది కాస్త చిన్నగా ఉండి ఒత్తైన కుచ్చులతో ఫ్లాట్‌గా ఉంటుంది. చివర కొనదేలినట్లుగా ఉండటంతో కళ్ల అడుగునా, మచ్చలు కనపడకుండా సులువుగా కన్సీలర్ వేసుకోవచ్చు.
కాంపాక్ట్ బ్రష్: ఒత్తైన మెత్తని కుచ్చులతో గుండ్రంగా ఉంటుందీ బ్రష్. దీన్ని బ్రాంజర్ కోసమే కాదు, కాంపాక్ట్ వేసుకునేందుకూ వాడుకోవచ్చు. వేసుకున్నాక ఒకసారి దులిపేస్తే...దానిపై పేరుకున్న దుమ్ము వదిలిపోతుంది. ఆపై సులువుగా రాసుకోవచ్చు.
టాల్కం పౌడర్ బ్రష్: ఇది లూజ్ పౌడర్ రాసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని బ్రిసిల్స్ వెడల్పుగా, విచ్చుకున్నట్లుగా ఉంటాయి. ఈ బ్రష్ వల్ల పౌడర్ సన్నని గీతలూ, చిన్నచిన్న లోపాలపై అదనంగా పేరుకోదు.
ఐషాడో బ్రష్... పొట్టిగా ఉండి మెత్తని కుచ్చులతో ఉన్న ఈ బ్రష్ కళ్లను మెరిసేలా చేస్తుంది. ఐ మేకప్ సమానంగా పరుచుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.