స్పా తర్వాతా సంరక్షణ..

జుట్టురాలకుండా ఉండటానికి హెయిర్‌ స్పా ప్రయోజనకరమైన చికిత్స. ఇది దెబ్బతిన్న జుట్టును మరమ్మతులు చేయడంలో సహాయపడుతుంది. అయితే చేయించుకున్న తర్వాతా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్పా చేయించుకున్నాక బయటకు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళి జుట్టుపై పడకుండా స్కార్ఫ్‌లను వాడండి.

Published : 30 Jun 2023 00:16 IST
జుట్టురాలకుండా ఉండటానికి హెయిర్‌ స్పా ప్రయోజనకరమైన చికిత్స. ఇది దెబ్బతిన్న జుట్టును మరమ్మతులు చేయడంలో సహాయపడుతుంది. అయితే చేయించుకున్న తర్వాతా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
స్పా చేయించుకున్నాక బయటకు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళి జుట్టుపై పడకుండా స్కార్ఫ్‌లను వాడండి. పెద్దపళ్లు ఉన్న దువ్వెనతో మాత్రమే దువ్వండి. వెంట్రుకలు తెగిపోకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది. స్పా తరువాత జుట్టు శుభ్రపరుచు కునేటప్పుడు షాంపూను కురులకు రాయకుండా నీళ్లలో కలపాలి. తక్కువ గాఢత కలిగిన కండిషనర్లను ఉపయోగించండి.
ఇలా చేయొద్దు... స్పా తర్వాత కనీసం రెండు మూడు రోజులు తలస్నానం చేయకూడదు. చేస్తే ప్రయోజనం ఉండదు. పోషకాలు అందవు.
హెయిర్‌ స్టైలింగ్‌ సాధనాలను ఉపయోగించకూడదు. ఇవి కేశాలను మళ్లీ నిర్జీవంగా, పొడిగా మార్చేస్తాయి. సహజపద్ధతుల్లోనే జుట్టును ఆరబెట్టుకోవాలి. ఒకవేళ వీటిని ఉపయోగించాల్సి వస్తే అలోవెరా జెల్‌ లేదా కండిషనర్‌ను రాశాక వాడొచ్చు.
నూనెలు రాయకూడదు. ప్యాక్‌లు, మాస్క్‌లు వేయకూడదు. స్పా చేసిన సమయంలో కురులను డీప్‌కండిషనింగ్‌ చేస్తారు. కాబట్టి కొన్ని రోజులు వీటికి దూరంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని