బొప్పాయి.. అందానికి మేలోయి

కాలం ఏదయినా చర్మం జిడ్డుగానే కనిపిస్తుంటుంది కొందరికి. ఇలాంటి వారి మోము మెరిసిపోయేలా చేయడంలో బొప్పాయి ఎంతో కీలకంగా పనిచేస్తుంది.

Published : 03 Jul 2023 00:39 IST

కాలం ఏదయినా చర్మం జిడ్డుగానే కనిపిస్తుంటుంది కొందరికి. ఇలాంటి వారి మోము మెరిసిపోయేలా చేయడంలో బొప్పాయి ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అదెలాగంటే...

  • జిడ్డు చర్మతత్వం ఉన్నవారు బొప్పాయి గుజ్జులో రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే సరి. చర్మంపై మురికి, టాన్‌ వంటివి తొలగిపోతాయి. ముఖం నిగారిస్తుంది.
  • విటమిన్‌ సి, ఎతో పాటు మరెన్నో పోషకాలు పుష్కలంగా దొరికే వాటిల్లో బొప్పాయి ఒకటి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు బొప్పాయి ముక్కల్ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి ఆపై దాంతో సున్నితంగా మర్దన చేస్తే సరి. కాలుష్యం, ఎండ తదితర కారణాలతో కాంతిని కోల్పోయిన చర్మం పునరుత్తేజితమవుతుంది.
  • బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చాలు. జిడ్డు తొలగిపోతుంది. మొటిమలూ తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని