నడకకు షూ కొంటున్నారా...
వ్యాయామంలో భాగంగా పరుగు లేదా వాకింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే సరైన షూ ఎంచుకోవడమూ తప్పనిసరే! లేదంటే ఆరోగ్యం సంగతేమో కానీ కొత్త అనారోగ్యాలు దరిచేరగలవు. కాబట్టి..
వ్యాయామంలో భాగంగా పరుగు లేదా వాకింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే సరైన షూ ఎంచుకోవడమూ తప్పనిసరే! లేదంటే ఆరోగ్యం సంగతేమో కానీ కొత్త అనారోగ్యాలు దరిచేరగలవు. కాబట్టి..
వాకింగ్ కోసం... నడవడానికి షూ తీసుకోవాల్సినప్పుడు భారీ, తేలికగా అనిపించే దేన్నైనా తీసుకోవచ్చు. పాదాన్ని స్థిరంగా అడుగేసేలా చేయగలగాలి. మడమ కాలర్, ఇన్‌సోల్, మిడ్‌సోల్ తగినంత మెత్తగా అనిపించాలి. వీటిని ధరించేటప్పుడు మడమను నేలపై ఉంచి పాదం వేళ్లను కొంచెం పైకెత్తి చూడాలి. షూ బాగా వంగుతుందా లేదా గుర్తించాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండే వాటినే ఎంచుకోవాలి. అప్పుడే పాదం వెనుకవైపు సౌకర్యంగా ఉండి, నొప్పి, వాపు వంటివి రావు. కండరాలపై ఒత్తిడి ఉండదు. ఎక్కువ దూరం నడిచేటప్పుడు నడుం నొప్పి, పాదాల అలసట, వాపు వంటివి రావు. అనుకున్న ఫిట్‌నెస్ సాధ్యపడుతుంది. అలాగే పరుగుకు తేలికైన బూట్లను ఎంచుకోవాలి.
ట్రెక్కింగ్... ఎత్తైన ప్రాంతాలు, అసమానంగా ఉండే ఎత్తుపల్లాల మార్గాలు, రాళ్ల రహదారిలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు లైట్‌వెయిట్ షూ తీసుకోవాలి. అప్పుడే పాదం తేలికగా, వేగంగా కదులుతుంది. అయితే ఇందులో యాంకిల్ సపోర్ట్ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తపడాలి. వాటర్‌ప్రూఫింగ్ ఉన్నదాన్ని ఎంచుకోవడం మంచిది. లేదంటే షూలోపల తడి చేరి పాదం జారుతూ, నడవడానికి అసౌకర్యం ఏర్పడుతుంది. అలాగే లోపలి చెమట ఎప్పటికప్పుడు ఆరిపోయేలా ఉండే మెటీరియల్‌తో తయారయ్యే బూట్లు ట్రెక్కింగ్‌కు సరైన ఎంపిక.
పరిశీలించి.. వ్యాయామాల షూలను సాయంకాలం వేళల్లోనే కొనుగోలు చేయాలి. రోజంతా నడిచిన తర్వాత మాత్రమే పాదాలకు సరైన సైజు ఎంపిక చేయడం తేలికవుతుంది. కొనే ముందు వాటిని ధరించి నాలుగడుగులు వేసి పరిశీలించాలి. సౌకర్యంగా అనిపిస్తేనే ఎంచుకోవాలి. కొనే ముందే అవి మన పాదాలకు సరిపోతాయో లేదో గుర్తించకపోతే ఆ తర్వాత పాదాలపై ఒత్తిడి పడి నలువైపులా గాయాలవ్వొచ్చు. నాలుగురోజులు నడిస్తే అవే సరిపడతాయని భావించి కొనసాగిస్తే మాత్రం ఆ ప్రభావం నడుం వద్ద కండరాలపై పడే ప్రమాదం కూడా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.