యవ్వనంగా కనిపించాలా..

కాలుష్యం, ఆహారంలో మార్పులు.. చిన్నవయసులోనే ముడతలు, గీతలకు కారణం అవుతున్నాయి. వీటికి కొన్ని చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చని తెలుసా?

Updated : 05 Jul 2023 00:44 IST

కాలుష్యం, ఆహారంలో మార్పులు.. చిన్నవయసులోనే ముడతలు, గీతలకు కారణం అవుతున్నాయి. వీటికి కొన్ని చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చని తెలుసా?

ఉదయాన్నే ఫేస్‌ మసాజ్‌ చేసుకోండి. దీనికోసం మార్కెట్‌లో మసాజర్లు దొరుకుతున్నాయి. వీటితో వలయాకారంలో మర్దనా చేసుకుంటే చర్మానికి కావాల్సిన రక్తప్రసరణ జరుగుతుంది.

ఉదయం లేవగానే మోముని చల్లటి నీటితో కడగాలి. తర్వాత ఓ గిన్నెలో నీటిని తీసుకుని దానిలో కొన్ని ఐస్‌క్యూబ్‌లు వేసి ముఖాన్ని దానిలో ముంచి తీస్తూ ఉండాలి. దీని వల్ల చర్మం తేమగానే కాదు మెరుస్తూ కూడా ఉంటుంది.

తగినంత నిద్ర చాలా అవసరం. రోజుకు 7నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. సరైన నిద్రతో ఒత్తిడి తగ్గి వృద్ధాప్య ఛాయలూ దరికి చేరవు.

చర్మం పొడిబారకుండా కూడా చూసుకోవాలి. ఇందుకు తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. దీని వల్ల శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మం తేమగా, మృదువుగా కూడా మారుతుంది.

సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. నీటి శాతం పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని