సరిగానే దువ్వుతున్నారా?

జుట్టు బాగా పెరగాలని ఏవేవో ఉత్పత్తులు వాడుతుంటాం. కానీ.. సరిగా దువ్వుతున్నారో లేదో కూడా చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు.

Published : 06 Jul 2023 00:27 IST

జుట్టు బాగా పెరగాలని ఏవేవో ఉత్పత్తులు వాడుతుంటాం. కానీ.. సరిగా దువ్వుతున్నారో లేదో కూడా చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు. దువ్వే పద్ధతి సరిగా ఉంటేనే రక్తప్రసరణ బాగా జరిగి.. కురుల ఎదుగుదలా బాగుంటుంది. కాబట్టి..

  • చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్లున్న దువ్వెననే ఎంచుకోండి. అప్పుడే సులువుగా కురులు విడివడతాయి. ఆపైన మృదువైన పళ్లున్న ఏదైనా బ్రష్‌తో దువ్వితే మాడుకీ మసాజ్‌ అయినట్లు ఉంటుంది. అయితే వీలైనంతవరకూ తడిగా ఉన్నప్పుడు దువ్వొద్దు. ఆ సమయంలో జుట్టు బలహీనంగా ఉంటుంది. కొద్దిపాటి ఒత్తిడికే ఊడిపోయే అవకాశం ఎక్కువ.
  • దువ్వడమంటే నేరుగా మాడు నుంచే మొదలుపెడుతున్నారా? అదెప్పుడూ మంచి పద్ధతి కాదు. కింది నుంచి చిక్కులు తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. అప్పుడు వెంట్రుకలపై ప్రయోగించే బలం తగ్గుతుంది. ఫలితంగా ఊడదు. ఇంకా చిట్లడం, తెగడం లాంటివీ ఉండవు.
  • మృతకణాలను తొలగించడానికి స్క్రబ్‌ ఉపయోగిస్తాం కదా! తలకీ ఆ ఎక్స్‌ఫోలియేటింగ్‌ కావాలి. లేదంటే డెడ్‌స్కిన్‌ అలాగే ఉండిపోతుంది. తలపై సహజ నూనెలు విడుదలవుతుంటాయి. ఇలాంటప్పుడు మృతకణాలు మాడు మీద అలాగే ఉండిపోతే కొత్త వెంట్రుకలు రాకుండా అడ్డుపడతాయి. నూనెలూ తలంతా పరచుకోవు. కాబట్టి, రోజుకు రెండుసార్లు దువ్వెనతో దువ్వాలి. అప్పుడు మృతకణాలు పోతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని