వయసు దాచేద్దామా
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కళ్ల కింద నల్లటి చారలు, వలయాలు, గీతలు వంటివెన్నో మనల్ని పలకరిస్తాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కళ్ల కింద నల్లటి చారలు, వలయాలు, గీతలు వంటివెన్నో మనల్ని పలకరిస్తాయి. చర్మ సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే చిన్న చిన్న మేకప్ మెలకువలనీ పాటిస్తూ మన వయసుని దాటేయొచ్చు. అవేంటంటారా!
- ఎండ, కాలుష్యం, పెరుగుతోన్న వయసు ప్రభావం...ముఖం మీద మచ్చల రూపంలో కనిపిస్తుంటుంది. వీటిని కనిపించనీయకుండా చేయాలంటే లిక్విడ్ ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి. దీనివల్ల మచ్చలు కనపడవు.
- మేకప్‌కి ముందు ఐస్ ముక్కతో ముఖానికి అద్దితే ముఖం ఉబ్బినట్లు కనిపించదు. ముఖంపై చర్మ గ్రంథులూ తెరుచుకుని కనిపించవు. అంతేకాదు, నల్లటి వలయాలూ, గీతలూ వంటివి కాసేపు కనుమరుగై తాజాగా కనిపిస్తుంది. చర్మం అలంకరణకు అనువుగానూ మారుతుంది.
- కళ్ల కింద వలయాలు కనిపించకుండా ఉండాలంటే రోజూ రాత్రి పూట ఐక్రీమ్ రాసుకోవడం మరచిపోవద్దు. మేకప్ వేసుకునేటప్పుడూ దీన్ని రాశాకే కన్సీలర్ వాడాలి.
- భుజాల మీద, చేతుల కిందా కొందరిలో స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తుంటాయి. ఇవి పూర్తిగా పోకపోయినా... కాస్త తక్కువగా కనిపించడానికి రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు... మాయిశ్చరైజింగ్ చేశాక కొద్దిగా లిక్విడ్ ఫౌండేషన్, కన్సీలర్‌లను చర్మ ఛాయలో కలిసి పోయేలా బ్రష్‌తో రుద్దాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.