తడిసినా పాడవదు!
ఆరోగ్యంపై శ్రద్ధ, ఫ్యాషన్.. ఏదైతేనేం.. స్మార్ట్ వాచ్‌లను ఎంచుకుంటున్న అమ్మాయిలే ఎక్కువ. అసలే వర్షాకాలం! ఏ క్షణంలో చినుకులు పలకరిస్తాయో తెలియదు.
ఆరోగ్యంపై శ్రద్ధ, ఫ్యాషన్.. ఏదైతేనేం.. స్మార్ట్ వాచ్‌లను ఎంచుకుంటున్న అమ్మాయిలే ఎక్కువ. అసలే వర్షాకాలం! ఏ క్షణంలో చినుకులు పలకరిస్తాయో తెలియదు. వర్షంలో పొరపాటున తీసి, బ్యాగులో పడేయడం మర్చిపోయామో పాడైనట్లే. అంతంత ధరలు పెట్టి కొన్న వస్తువు పాడైతే ఎవరికైనా బాధే కదా! అందుకే వచ్చాయీ వాచ్ ప్రొటెక్టివ్ కవర్లు. టెంపర్డ్ గ్లాస్ ఉన్న ఈ చిన్న పెట్టెలాంటి పరికరాన్ని వాచ్‌కి అమరిస్తే చాలు. నీటి నుంచి గడియారానికి రక్షణ కవచంలా మారుతుంది. పొరపాటున తడిసినా ప్రమాదం ఉండదు. భిన్న రంగుల్లోనూ దొరుకుతున్నాయి. కావాలనిపిస్తే ఆన్‌లైన్ వేదికల్లో వెతికేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.