అధరాల అందానికి..

ముఖానికి మేకప్‌ ఉన్నా లేకున్నా, పెదాలకు కాస్త లిప్‌స్టిక్‌ అద్దితే చాలు... మోము మెరిసిపోతుందని భావించే వారి సంఖ్య ఎక్కువే. అలంకరణ పూర్తయ్యాక అధరాలకు రంగు వేయకపోతే.... ముఖానికి కళ రాలేదని అనుకునేవారూ ఉన్నారు.

Published : 10 Jul 2023 00:08 IST

ముఖానికి మేకప్‌ ఉన్నా లేకున్నా, పెదాలకు కాస్త లిప్‌స్టిక్‌ అద్దితే చాలు... మోము మెరిసిపోతుందని భావించే వారి సంఖ్య ఎక్కువే. అలంకరణ పూర్తయ్యాక అధరాలకు రంగు వేయకపోతే.... ముఖానికి కళ రాలేదని అనుకునేవారూ ఉన్నారు. అయితే, ఎప్పుడు వేసుకున్నా ఈ చిట్కాలను పాటిస్తే మేలు. అవేంటంటారా?

* తరచూ లిప్‌స్టిక్‌ వాడటం వల్ల పెదాలు తేమను కోల్పోయే అవకాశం ఉంది. అందుకే, రోజూ తప్పనిసరిగా కాస్త వెన్న లేదంటే పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి.  అలానే తేనె, పంచదార మిశ్రమంతో మృదువుగా రుద్ది మృతకణాలను తొలగిస్తే రంగు వేశాక ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తాయి.

* పెదవుల అంచులకు రాసే లిప్‌లైనర్‌ని తక్కువ అంచనా వేయొద్దు. ఇది వాటి ఆకృతిని చక్కగా కనిపించేలా చేస్తుంది. రంగు గీత దాటకుండా అడుకట్టా వేయగలుగుతుంది. అందుకే ముందు లైనర్‌తో గీశాకే లిప్‌స్టిక్‌ వేయండి.

* లిప్‌స్టిక్‌ల్లో బోలెడు రంగులూ, మరెన్నో ఛాయలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే చర్మఛాయను బట్టే ఎంపిక ఉండాలి. అలాగని ఎప్పుడూ ఒకే వర్ణాన్ని వేసుకోవాలన్నా బోర్‌ కొట్టేయొచ్చు. రెండు మూడు షేడ్‌లను దగ్గర ఉంచుకుంటే దుస్తులను బట్టి, నప్పేది వేసుకోవచ్చు.

* ఏది ఎంపిక చేసుకున్నా సరే మీ దగ్గర న్యూడ్‌ మాటీ లిప్‌స్టిక్‌ కూడా ఉంచుకోండి. లేత రంగులు ఎంచుకున్నప్పుడు కొద్దిగా దీంతో షేడ్‌ ఇచ్చి చూడండి. అలానే లిప్‌గ్లాస్‌ కూడా పెదాల ఆకృతిని చక్కగా కనిపించేలా చేస్తుంది.

* కన్సీలర్‌.. లిప్‌ ప్రైమర్‌గా బాగా పనిచేస్తుంది. లిప్‌స్టిక్‌ బయటకు చెదరకుండా, ముద్దముద్దగా అంటుకోకుండా కూడా ఇది చూసుకుంటుంది. దాన్నీ దగ్గర ఉంచుకుంటే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని