ఆన్‌లైన్‌లో ఫౌండేషన్‌ కొంటున్నారా...

షాపింగ్‌ చేసేటప్పుడు ముఖఛాయకు సరిపడే ఫౌండేషన్‌ను చెక్‌ చేసుకొని మరీ కొనుక్కోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆ అవకాశం ఉండదు. అది సరిపడకపోతే శ్రమ, కొన్నిసార్లు డబ్బూ వృథా.

Published : 11 Jul 2023 00:06 IST

షాపింగ్‌ చేసేటప్పుడు ముఖఛాయకు సరిపడే ఫౌండేషన్‌ను చెక్‌ చేసుకొని మరీ కొనుక్కోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆ అవకాశం ఉండదు. అది సరిపడకపోతే శ్రమ, కొన్నిసార్లు డబ్బూ వృథా. కాబట్టి..

పొడి చర్మం ఉన్నవారికి లిక్విడ్‌ ఫౌండేషన్‌ సరైన ఎంపిక. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. జిడ్డు చర్మం వారు మ్యాటిఫైయింగ్‌ లేదా పౌడర్‌ తరహాది తీసుకొంటే మేకప్‌ను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. కొందరికి మొటిమల సమస్య ఉంటుంది. వారికి మైల్డ్‌ మినరల్‌ బేస్డ్‌ ఫార్ములేషన్స్‌ అయితే ముఖం నునుపుగా కనిపించేలా చేస్తాయి.

పరిశీలించి.. ప్రస్తుతం పలు సౌందర్య సాధనాల సంస్థలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వినియోగదారులకు వర్చువల్‌ ట్రై-ఆన్‌ సర్వీస్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ప్రత్యేక సాంకేతికత ద్వారా చర్మవర్ణం, తీరులను గుర్తించి తగిన షేడ్స్‌ను ఎంపికచేసి మరీ సూచిస్తున్నాయి. ఈ సౌకర్యాలనూ వినియోగించుకోవచ్చు. ముఖానికి నప్పితే సరిపోదు నాణ్యతకు కూడా పెద్దపీట వేయడం మంచిది. ఉత్పత్తులను ఎంపిక చేసుకొనేముందు వాటి రివ్యూలను పరిశీలించాలి. అలాగే రసాయనరహితమైనవాటిని ఎంచుకొంటే ముఖచర్మం ఎటువంటి చెడు ప్రభావానికీ లోను కాకుండా సంరక్షించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని