ఆ నలుపు పోవాలంటే!

ముఖంపై చిన్న మచ్చ వచ్చినా అది తగ్గే వరకూ ఏవేవో క్రీములు రాస్తుంటాం. అందమైన చేతులు, కాళ్ల కోసం మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయిస్తూ ఉంటాం.

Updated : 12 Jul 2023 05:01 IST

ముఖంపై చిన్న మచ్చ వచ్చినా అది తగ్గే వరకూ ఏవేవో క్రీములు రాస్తుంటాం. అందమైన చేతులు, కాళ్ల కోసం మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయిస్తూ ఉంటాం. కానీ మోకాళ్లు, కాలి మడమలు, మోచేతుల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. దీనివల్ల అక్కడి చర్మం గరుకుగా, నల్లగా మారుతుంది. ఇలాంటప్పుడు ఇంటి చిట్కాలతో ఈ సమస్యనెలా దూరం చేయొచ్చంటే...

పచ్చిపాలు-బాదం ఐదు బాదం గింజలను తీసుకుని నాలుగు గంటలు పచ్చి పాలల్లో నానబెట్టి పేస్టులా చెయ్యాలి. దీనిని మోచేతులు, కాళ్లు, నల్లగా ఉన్న చోట రాసి ఆరాక శుభ్రం చేస్తే సరి. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

కలబంద గుజ్జు చర్మ సమస్యలకు కలబంద మంచి మాయిశ్చరైజర్‌ లాగా పని చేస్తుంది. ఈ గుజ్జుని గరుకుగా ఉన్న ప్రదేశాల్లో రాసి మృదువుగా మర్దన చేయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగితే ఫలితం ఉంటుంది.

నిమ్మరసం ఇది సహజ క్లీనరుగా పని చేస్తుంది. శరీరంపై పేరుకున్న మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. నిమ్మచెక్క పై కొద్దిగా ఉప్పు వేసి మోచేతి, కాళ్లు, మడమలు పై రుద్దాలి. కొంత సేపు ఆగాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మేలు.

వెనిగర్‌ పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని కాంతిమంతం చేయడమే కాకుండా తేమగా ఉంచుతుంది. రెండు చెంచాల పెరుగులో మూడు చుక్కల వైట్‌ వెనిగర్‌ కలిపి నల్లగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరాక వేడి నీటితో కడిగితే సరి.

చక్కెర స్పూన్‌ చక్కెరలో నాలుగైదు చుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై పదిహేను నిమిషాలు స్క్రబ్‌ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఆలివ్‌ ఆయిల్‌ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చక్కెర మృత కణాలను తొలగిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని