అక్కడెందుకు మినహాయింపు
చీరల్ని ఇష్టపడని మగువలుండరు. కానీ, ఉద్యోగినుల విషయంలో మాత్రం ఇవి వేడుకలకు ధరించే దుస్తుల జాబితాలో చేరిపోయాయి. కార్యాలయాలకు కట్టుకుని వెళ్లమంటే... ‘సర్దుకునే సమయం ఉండదు.
చీరల్ని ఇష్టపడని మగువలుండరు. కానీ, ఉద్యోగినుల విషయంలో మాత్రం ఇవి వేడుకలకు ధరించే దుస్తుల జాబితాలో చేరిపోయాయి. కార్యాలయాలకు కట్టుకుని వెళ్లమంటే... ‘సర్దుకునే సమయం ఉండదు. మేం క్యారీ చేయలేం’ అంటూ రకరకాల సమాధానాలు చెప్పేస్తుంటారు. కానీ సరైన ఎంపిక ఉంటే కాన్ఫరెన్సులూ, కార్పొరేట్ మీటింగుల్లోనూ ప్రధాన ఆక్షరణగా నిలవొచ్చు.
నార చీరలు
క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లు నేసిన నార చీరలకు ప్రాధాన్యమిస్తే చాలు. సౌకర్యంగా ఉంటుంది. చెమట పడుతుందన్న భయమూ ఉండదు. నలుగురిలోకి వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా, హుందాగా కనిపించొచ్చు.
టస్సర్
వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు టస్సర్ చీరలను ఎంచుకుంటే మంచిది. ఇది పట్టుకి మరో రూపం. కాన్ఫరెన్సులు, కార్పొరేట్ ఈవెంట్లకు కట్టుకుని వెళితే ఆకర్షణీయంగా కనిపిస్తారు.
జార్జెట్
తేలిగ్గా, సౌకర్యంగా ఉండటమే కాదు... ఆహ్లాదకరమైన రంగుల్లో ఆకట్టుకుంటాయి జార్జెట్ చీరలు. ఇవి ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు కట్టుకుంటే సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.