అందమైన కురులకు.. అల్లం!
జీర్ణశక్తిని పెంచడంలో.. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించడంలో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మరి కురుల ఆరోగ్యాన్నీ సంరక్షిస్తుందని తెలుసా?
జీర్ణశక్తిని పెంచడంలో.. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించడంలో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మరి కురుల ఆరోగ్యాన్నీ సంరక్షిస్తుందని తెలుసా?
- పావుకప్పు కొబ్బరి నూనెకి స్పూను అల్లం నూనె కలపాలి. దీన్ని మొదళ్ల నుంచి కురుల చివరి వరకు పట్టించాలి. 20 నిమిషాలయ్యాక తలస్నానం చేస్తే మెత్తని, మృదువైన కురులు సొంతమవుతాయి.
- అల్లంలో విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. పావు కప్పు కొబ్బరినూనెకి 3 చుక్కల అల్లం రసాన్ని కలిపి మాడుకి పట్టిస్తే సరి. మాడుపై రక్తప్రసరణ సమృద్ధిగా జరగడంతోపాటు కుదుళ్లకీ పోషణ అంది కురులు దృఢంగా మారతాయి. దీనిలోని పోషకాలు వెంట్రుకలకు తగినంత తేమను అందించి, చిట్లడాన్నీ అరికడతాయి.
- చుండ్రు సమస్యా? షాంపూ నీటికి 2-3 చుక్కల అల్లం రసం కలిపి తలంటుకోండి. దీనిలోని యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మాడు మీద ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. దురద, చిన్న దద్దుర్లు వంటివాటినీ తగ్గిస్తాయి.
అల్లం వేళ్ల రసాన్ని తలకు పట్టించినా మంచిదే. మాడు ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు.. కురులూ దృఢంగా మారతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.